ఆంధ్రప్రదేశ్‌

విలువలు, విశ్వసనీయతను పాతరేసిన బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), మార్చి 25: ఇసుక, మట్టి, రాజధాని భూములు, పోలవరం, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు ఇలా దేన్నీ వదలకుండా రాష్ట్రం మొత్తాన్ని టీడీపీ నేతలు దోచుకుంటున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ సోదరి షర్మిల విమర్శించారు. చంద్రబాబు ఐదు సంవత్సరాల పాలనతో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, రాష్ట్రంలో ఏ మూల చూసినా అవినీతి తాండవిస్తోందన్నారు. విలువలు, విశ్వసనీయతను పాతరేసిన చంద్రబాబు తన కొడుక్కి మాత్రమే రాష్ట్రంలో జాబు ఇచ్చారన్నారు. టీడీపీ పాలనలో అథోగతి పాలయిన రాష్ట్ర భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టేగలిగే సామర్థ్యం కేవలం జగన్‌కు మాత్రమే ఉందన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే ఆర్కేతో కలిసి షర్మిల మాట్లాడుతూ నిత్యం ప్రజలను మోసం చేస్తూ, అబద్ధాలు ఆడుతూ అవినీతిపాలనతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న చంద్రబాబును ఓడించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకం అన్నారు. రాష్ట్ర ప్రజలు ఏమరుపాటుగా ఉండరాదన్నారు. రాష్ట్రంలో భూతద్దం పెట్టుకుని వెదికినా అభివృద్ది అనేది కనిపిస్తోందా అని ప్రశ్నించారు. బాబు చెబుతున్నట్లుగా పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు ఎన్ని వచ్చాయో చెప్పగలరా అని ప్రశ్నించారు. వ్యవసాయం వెన్నుముక అయిన రాష్ట్రంలో రైతును బాగు చేసేందుకు ఏమైనా చేశారా అన్నారు. రైతుల నుండి బలవంతంగా సేకరించిన భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఇప్పుడు గ్రాఫిక్స్ చూపించడం లేదా అన్నారు. ఒక్క శాశ్వతభవనం కూడా నిర్మించలేదన్నారు. విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్ ఇవ్వని కారణంగా వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. పేదవాడి ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారన్నారు. మొదటి ఐదు సంతకాలు పెట్టిన బాబు వాటిలో ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. రుణమాఫీ అని చెప్పిన బాబు వివిధ కోతలు వేసి 24వేల కోట్లకు కుదించారన్నారు. డ్వాక్రా రుణ మాఫీకి చంద్రబాబు హామీ ఇస్తే, అటువంటి ప్రతిపాదన లేదు అని అసెంబ్లీలో మంత్రి సునీత ప్రకటించలేదా అన్నారు. మహిళల రుణాలు 14వేల కోట్ల రూపాయలు చెల్లించని కారణంగా నేడు ఆ మొత్తం 25 వేల కోట్లకు చేరుకుందన్నారు. రుణమాఫీ చేయకపోగా కేవలం ఆరువేల కోట్ల రూపాయలను భిక్షం ఇచ్చినట్లు పసుపు కుంకుమ పేరుతో ఇచ్చారన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు కమీషన్ల కోసం అంచనాలు 60 వేల కోట్లకు తీసుకువచ్చి ఐదు సంవత్సరాలైనా పూర్తి చేయలేదన్నారు. హోదా అంటే జైలుకు పంపుతాము, హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని చెప్పిన బాబు హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అని అసెంబ్లీలో తీర్మానం చేయలేదా అన్నారు. ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి జన్మభూమి కమిటీలను పెట్టి లంచగొండితనం, దౌర్జన్యాలను ప్రోత్సహించలేదా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌భు అప్పల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారన్నారు. గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తానే హైదరాబాద్‌ను అభివృద్ది చేశానని చెబుతున్న బాబు, ఐదు సంవత్సరాల్లో అమరావతిని ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. హోదా కోసం జగన్ ఢిల్లీలోనూ, ఏపీలోనూ ఆందోళనలు చేశారన్నారు. వైకాపా ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. తరువాత రాజీనామాల చేశారన్నారు. జగన్ ఉరూరా తిరిగి హోదా కోసం పోరాడి ఉండకపోతే బాబు నోట హోదా మాట వచ్చి ఉండేది కాదన్నారు. ముందు బీజేపీతో పొత్తు ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు అని చంద్రబాబు తీరును విమర్శించారు.
బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు, కానీ బాబు మాత్రం తన కొడుక్కి మాత్రమే జాబు ఇచ్చారన్నారు. ప్రభుత్వ సమాచారాన్ని డేటాను చోరీ చేసి సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఇవ్వడం నిజం కాదా అన్నారు. టీడీపీ నేతల పాలన కారణంగా రాష్ట్రం దుర్మార్గుల చేతిలో చిక్కి అల్లాడుతోందన్నారు. ఇప్పడు ప్రజలు పొరపాటు చేస్తే ఏపీ మళ్లీ పాతికేళ్లు వెనకకు వెళ్తుందని ఆమె హెచ్చరించారు. వెన్నుపోటు రాజకీయాలు చేయడం, గోబెల్స్ ప్రచారం చేయడం, మోసం, దగా, కుట్రలు, హత్యలు చేయడం, చేసిన వారిని రక్షించడంలో చంద్రబాబుకు అనుభవం ఉందన్నారు. రాజారెడ్డి, వివేకానందరెడ్డి హత్య జరిగిన సందర్భాల్లో చంద్రబాబే సీఎంగా ఉన్నారన్నారు. వివేకానంద హత్యతో సంబంధం లేకపోతే ధర్డ్‌పార్టీ విచారణ జరిపించేందుకు ఎందుకు బాబు అంగీకరించడం లేదన్నారు. తాను ఒక సామాన్యురాలిగా మాత్రమే ప్రశ్నిస్తున్నానని, వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత బాబుపై ఉందన్నారు. ఈనెల 29వ తేది నుండి ఎన్నికల ప్రచారం మంగళగిరి నుండి ప్రారంభిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తాను ప్రచారం చేసినా చేయకపోయినా వైసీపీ బంపర్ మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు. బాబు డైరక్షన్‌లో పవన్ యాక్టింగ్ చేస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. డేటా చోరీకి సంబంధించి పవన్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. వివేకహత్య గురించి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. జనసేనకు ఓటేస్తే టీడీపీకి ఓటేసినట్లేనన్నారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న షర్మిల