ఆంధ్రప్రదేశ్‌

నెల్లూరు కార్పొరేషన్‌లో ఏడుగురు ఉద్యోగుల సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, జూలై 30: నెల్లూరు నగరపాలక సంస్థలోని సిటీ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న నలుగురు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, 3 టిపిఎస్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. రాష్ట్ర టౌన్ కంట్రీప్లానింగ్ డైరెక్టర్ రఘు శుక్రవారం రాత్రి 7 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటుతో పాటు వారి స్థానంలో కొత్తవారిని కూడా యుద్ధ ప్రతిపాదికన నియమించడం విశేషం. కార్పొరేషన్‌లో అవినీతి పెరిగిపోయిందని ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెట్టడంతో మంత్రి నారాయణ నేరుగా రంగంలోకి దిగి అవినీతిపై పూర్తి స్థాయిలో విచారించేందుకు ప్రభుత్వం నుంచి ఆరు టాస్క్ఫోర్స్‌ను బృందాలను రంగంలోకి దింపారు. 2015 సంవత్సరం నుంచి భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వాటిని టాస్క్ఫోర్స్ బృందాలు తనిఖీ చేశారు. మొత్తం 1100 బిల్డింగ్‌లు అక్రమంగా నిర్మించినట్లు టాస్క్ఫోర్స్ బృందం నిగ్గు తెల్చింది. దీంతో మంత్రి నారాయణ సీరియస్‌గా స్పందించి అక్రమ కట్టడాలను తొలగించే ప్రక్రియను చేపట్టారు. దీంతో 11 భవనాలను యుద్ధ ప్రతిపాదికన తొలగించారు. ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు, అదే పార్టీలో ఉన్న నాయకులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో అక్రమ భవనాలు కూల్చివేతకు స్వస్తి చెప్పారు. భవన నిర్మాణాలకు బిల్డింగ్ ప్లాన్ అధికారులకు భారీగా ముడుపులు చెల్లించాల్సి వచ్చిందని ప్రజలు టాస్క్ఫోర్స్ బృందాలకు చెప్పడంతో అవినీతిని ప్రోత్సహించిన అధికారులపై వేటు వేస్తేనే వ్యవస్థ బాగుటుందని ఉద్దేశంతో ఒక్కసారిగా ఏడుగురు ఉద్యోగులపై వేటు వేశారు.