ఆంధ్రప్రదేశ్‌

ఆగిన బస్సును ఢీకొన్న కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్దిపాడు, జూలై 30: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని వెంకట రాజుపాలెం వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మద్దిపాడు పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌నుండి నర్సరావుపేట మీదుగా కందుకూరుకు వెళ్తున్న ఇండికా కారు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు మండలంలోని వెంకటరాజుపాలెం వద్దకు రాగానే రహదారిపై ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న యోహన్‌బాబు పువ్వాడ (28), షేక్ నబీ (28), ఎం మురళి (30)లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి వెంకట్రావుకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ఒంగోలు రూరల్ సి ఐ మురళికృష్ణ ఆధ్వర్యంలో సంఘటనా స్థలానికి వెళ్ళి విషయాలను సేకరించారు. స్థానికుల సహకారంతో కారును బయటకు లాగి మృతుల వివరాలను సేకరించారు. వీరంతా కందుకూరు కు దగ్గరలో ఉన్న సామీర్‌పాలెం, శింగరాయకొండ వద్ద గల కనమళ్ళకు చెందిన వారుగా గుర్తించారు. పంచనామా అనంతరం మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. తీవ్ర గాయాల పాలైన వెంకట్రావును చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను మద్దిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సిఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆయన వెంట మద్దిపాడు ఎస్‌ఐ దేవకుమార్, ఎయస్‌ఐ మస్తాన్‌రావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

చిత్రం..ప్రకాశం జిల్లా మద్దిపాడువద్ద ప్రమాదానికి గురైన వాహనం