ఆంధ్రప్రదేశ్‌

వేసవిలో నీటి ఎద్దడి నివారణకు రూ. 184 కోట్లతో ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 17 : రాష్ట్రంలో వేసవిలో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని 184 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ విషయమై అధికారులతో సమీక్ష అనంతరం ఉండవల్లి ప్రజావేదిక వద్ద బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మంచినీటి సరఫరా ఎలా జరుగుతుందో గమనించి, కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. 2018-19 ఖరీఫ్‌లో 347 మండలాలు, రబీలో 257 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించామన్నారు. వర్షపాతం దాదాపు 32 శాతం తక్కువగా నమోదు కావడం వల్ల భూగర్భ జలాలు లభ్యత తక్కువగా ఉందన్నారు. గతంలో తాము తీసుకున్న చర్యల వల్ల మంచినీటి ఎద్దడి, వర్షం తక్కువ పడినా సమస్య తీవ్రత తగ్గిందన్నారు. ఈ వేసవిలో 3494 ఆవాస ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరాకు 60 కోట్ల రూపాయలు, ప్రైవేట్ వనరుల ద్వారా సరఫరాకు 2.26 కోట్లు, బోర్‌వెల్‌ల మరమ్మతులకు 14 కోట్లు, 471 చెరువులను నింపేందుకు 8 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఎక్కడైనా మంచినీటి సమస్య ఉంటే జలవాణికి ఫోన్ చేయాలన్నారు. వివిధ ఎత్తిపోతల పథకాల ద్వారా రాయలసీమ, తిరుపతికి నీటిని తరలిస్తున్నామన్నారు. నీటి సమస్యపై సమీక్షించేందుకు, ఎన్నికలకు సంబంధం లేదన్నారు. ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నాయన్నారు. అమల్లో ఉన్న పథకాలను సమీక్షించవచ్చునని, కొత్త విధాన నిర్ణయాలు మాత్రమే తీసుకోకూడదని వివరించారు.
చిత్రం...వేసవి నీటిఎద్దడిపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు