ఆంధ్రప్రదేశ్‌

ఐఏఎస్‌లు జైలుకు వెళ్లినప్పుడు వీరంతా ఎక్కడున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 17: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు రాష్ట్ర గవర్నర్‌కు కలవడంతో అర్థం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. బుధవారం ఉండవల్లి ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రతి ఐఏఎస్ అధికారిపైనా స్పందించడానికి వారు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలో 2017, ఫిబ్రవరి 8న ప్రతిపక్ష నాయకుడు జగన్ అప్పటి కలెక్టర్ అహ్మద్‌బాబు చొక్కా పట్టుకున్న సందర్భంలో రిటైర్డ్ ఆఫీసర్లందరూ ఎక్కడికి వెళ్లారో చెప్పాలని వర్ల ప్రశ్నించారు. విశాఖపట్నం పోలీసు కమిషనర్ యోగానంద్‌ను జగన్ బెదిరించినప్పుడు మీరెందుకు స్పందించలేదో చెప్పాలన్నారు. కలెక్టర్ రామారావు అధికారం చేపట్టిన రెండు రోజులకే అన్యాయంగా బదిలీ చేస్తే అప్పుడు మీరెందుకు స్పందించలేదన్నారు. సుబ్రహ్మణ్యం విషయంలో చంద్రబాబు వ్యాఖ్యల్లో తప్పేముందని వర్ల ప్రశ్నించారు. రమాకాంత్‌రెడ్డి చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎంతో మంది అధికారులు జైళ్ల పాలయ్యారన్నారు. వారిలో కలెక్టర్ శ్రీలక్ష్మీ జైలుకు వెళ్లినప్పుడు మీరు ఆమెను కనీసం పరామర్శించారా, అది మీ బాధ్యత కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ రిటైర్డ్ అధికారులు గవర్నర్‌కు కలవడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంపై కేసులుండడం, ఆ కేసులపై మే 10న కోర్టులో విచారణ జరగనుందన్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.