ఆంధ్రప్రదేశ్‌

వాళ్లది వ్యక్తిగత అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 17: వ్యక్తిగత అజండాతోనే తనపై గవర్నర్‌కు మాజీ ఐఏఎస్ అధికారులు ఫిర్యాదు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఉండవల్లి ప్రజావేదికలో ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై చర్య తీసుకోవాలని వ్యక్తిగత అజెండాతో ఫిర్యాదు చేయడం సరికాదన్నారు. వైకాపా అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి (సీఎస్) సహనిందితుడన్న వ్యాఖ్యలను ఆయన సమర్థిచుకున్నారు. సీఎస్‌పై తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదన్నారు. వివిధ కేసుల్లో జగన్‌తో పాటు సహనిందితుడిగా రికార్లుల్లో ఉండటం నిజం కాదా అని ప్రశ్నించారు. తాను ఎవరికీ వ్యక్తిగతంగా వ్యతిరేకం కానని, కానీ సిద్ధాంతాల విషయంలో రాజీపడనని స్పష్టం చేశారు. సీఎస్‌గా సుబ్రహ్మణ్యాన్ని నియమించే సమయంలో ఈ విషయం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియదా అనిప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా నియమించడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. సీఎస్‌గా ఉన్న అనిల్ చంద్ర పుణేఠాను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించినప్పుడు, ఒక గిరిజన అధికారిని విధుల నుంచి తొలగించినప్పుడు, ముగ్గురు పోలీస్ అధికారులను బదిలీ చేసినప్పుడు ఈ మాజీ ఐఏఎస్ అధికారులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పుణేఠా ఏమైనా తప్పు చేశారా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే ఎందుకు వీరు మాట్లాడలేదని విమర్శించారు. వ్యక్తిగత అజెండాతో గవర్నర్‌ను కలవడం సరికాదన్నారు. పోలింగ్ రోజున రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న సమయంలో డీజీపీని సీఎస్ సాయంత్రం 5 గంటల సమయంలో కలవాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. అలాంటి సయమంలో మొక్కలు నాటేందుకు వెళ్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో డీజీపీతో సమావేశం కావాల్సిన అవసరమేమిటన్నారు. ఇలా అయితే ఎన్నికలను ఎవరు నమ్ముతారన్నారు. ఢిల్లీలో కూర్చుని సీఈసీ ఫోజులు కొడుతున్నారని ఆరోపించారు.