ఆంధ్రప్రదేశ్‌

నేడు రాములోరి కల్యాణం...ముఖ్యమంత్రి రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 17: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి జరుగనున్న సీతారాముల కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు హాజరౌతున్నారు. ప్రభుత్వం తరపున సీతారామచంద్రులకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేయనున్నారు. కల్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సకలచర్యలు చేపట్టింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి 10 వరకు సీతారాముల కల్యాణం జరుగనుంది. ఈ బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, దేవదాయశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి హాజరుకానున్నారు. అలాగే కొంతమంది రాష్ట్ర మంత్రులు కూడా హాజరౌతున్నట్లు సమాచారం. వీరి రాక సందర్భంగా జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి పోలీసు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ఒంటిమిట్టలోని కల్యాణవేదిక వద్ద భద్రతా ఏర్పాట్లు పెంచారు. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కల్యాణఘట్టం, భక్తుల సౌకర్యాలు, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, పోలీసు సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. ఇప్పటికే 1200 మంది పోలీసు సిబ్బంది భద్రతాచర్యల్లో పాల్గొంటున్నారు. టీటీడీ తరపున ప్రత్యేక పోలీసు బలగాలను దేవాలయం చుట్టూ మోహరించారు.
ముఖ్యమంత్రి దంపతులు గురువారం సాయంత్రం 5.15 గంటలకు రాజధాని నుంచి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 5.30 గంటలకు కడప నగరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 6 గంటలకు కడప నుండి రోడ్డుమార్గాన బయలుదేరి ఒంటిమిట్ట కోదండరామాలయం చేరుకుంటారు. దేవాలయంలో మూలవిరాట్ దర్శనం, పూజలు, తీర్థప్రసాదాల స్వీకరణ అనంతరం 7.30 గంటలకు కల్యాణవేదికకు చేరుకుంటారు. రాత్రి 9.45 గంటల వరకు జరిగే సీతారాముల కల్యాణాన్ని తిలకించిన అనంతరం తిరిగి కడప నగరానికి చేరుకుని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బసచేస్తారు. సీఎం పర్యటన నేపధ్యంలో భద్రత దృష్ట్యా రోడ్డుమార్గాన కిలోమీటరుకు ఒక పోలీసును జిల్లా యంత్రాంగం నియమించింది. రోడ్డుమార్గాన ఉన్న స్పీడు బ్రేకర్ల వద్ద బాంబ్‌స్వ్కాడ్ పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టారు. కల్యాణ వేదిక ప్రాంతాన్ని జల్లెడపట్టారు.