ఆంధ్రప్రదేశ్‌

పెండింగ్‌లో ‘పోలవరం’ బిల్లులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: గత ఫిబ్రవరి మాసం నుంచి పోలవరం భూసేకరణకు సంబంధించి గానీ, పునరావాస పునర్నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి గానీ బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. ఇందులో ఒక్క భూసేకరణకు సంబంధించే సుమారు రూ.30 కోట్ల వరకు విడుదల చేయాల్సివుంది. అయితే జూన్ నాటికి 41 కాంటూర్ ప్రకారం ముంపు ప్రాంతాల్లో ఆర్ అండ్ ఆర్ పూర్తిచేయాల్సిందిగా అథారిటీ తాజాగా ఆదేశించింది. పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో పోలవరం అథారిటీ గత మూడు రోజులుగా సమీక్షించింది. ఒకవైపు భూసేకరణ బిల్లులు, మరోవైపు పునరావాస బిల్లులు కూడా స్థ్భించడంతో చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగావుంది.
గత మార్చి నెల వరకు పరిశీలిస్తే 2017-18కి సంబంధించి హెడ్‌వర్క్స్, ఆర్ అండ్ ఆర్, భూసేకరణకు సంబంధించి సుమారు 1398 బిల్లులను పీపీఎ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)కి సమర్పించారు. వీటి విలువ సుమారు రూ.3787.81 కోట్లు. 2018-19 మార్చి వరకు 6939 బిల్లులకు సంబంధించి సుమారు రూ.2119.31 కోట్ల విలువైన బిల్లులు పీపీఎకు సమర్పించారు. మరోవైపు ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధులకు సంబంధించి సుమారు రూ.4192 కోట్లు రీయింబర్స్ చేయాల్సివుంది. అయితే 41.15 మీటర్ల కాంటూరు వరకు ఆర్ అండ్ ఆర్, భూసేకరణకు సంబంధించిన పరిహారాలను ముందుగా పూర్తిచేయాల్సిందిగా అధారిటీ ఆదేశించింది. అయితే భూసేకరణకు సంబంధించి 69,047 ఎకరాలకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు రూ.3986 కోట్లు చెల్లింపులు చేయాల్సివుండగా 68,989 ఎకరాలకు సంబంధించి సుమారు రూ.3,930 కోట్లు వరకు చెల్లించారు. మిగిలిన మొత్తంలో రూ.30 కోట్ల వరకు బిల్లులు సమర్పించగా, పెండింగులో ఉన్నట్టు సమాచారం. ఇక ఆర్ అండ్ ఆర్‌కు సంబంధించి 18,635 మందికి రూ.3770 కోట్లు ఇవ్వాల్సివుండగా ఇప్పటి వరకు 3,922 మందికి రూ.802 కోట్లు చెల్లించారు. ఇంకా 14,713 మందికి రూ.2,969 కోట్లు ఇవ్వాల్సివుంది. మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి లక్షా 66వేల 213 ఎకరాల భూమిని సేకరించాల్సివుంది. ఇందులో లక్షా 10వేల 355 ఎకరాల వరకు సేకరించారు. సేకరించిన భూమికి సంబంధించి సుమారు రూ.30 కోట్ల బిల్లులు సమర్పించారు. వీటి తాలూకు నిధులు ఇంకా గత ఫిబ్రవరి నుంచి రాలేదు.
ఈ బిల్లుల నిధులు విడుదలైతే తప్ప ముందుకెళ్లే పరిస్థితి కన్పించడంలేదు. పునరావాసానికి సంబంధించి నాలుగు దశలుగా విభజించిన గ్రామాలకు పరిహారం చెల్లించాల్సివుంది. ఎడమవైపు ఫేజ్-1లో 7 గ్రామాలు, ఫేజ్-2లో 25 గ్రామాలు, ఫేజ్-3లో 10 గ్రామాలు, ఫేజ్-4లో 2 గ్రామాలకు చెల్లింపులు చేయాల్సివుంది. ఏదేమైనప్పటికీ అధారిటీ నిర్ధేశిత కార్యాచరణ ప్రకారం పనులు పూర్తికావాలంటే ఇటు పునరావానికి, అటు భూసేకరణకు సంబంధించిన నిధులు కూడా విడుదల కావాల్సివుంది. దీనికి తోడు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు ముందుకెళ్ళాలంటే హెడ్‌వర్క్సుకు సంబంధించి కూడా రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోతే గడ్డు పరిస్థితేనని తెలుస్తోంది.