ఆంధ్రప్రదేశ్‌

చైనా ఐఎఫ్‌ఆర్‌కు భారత యుద్ధ నౌకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 19: చైనాలో ఈ నెల 22,23 తేదీల్లో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)లో భారత్ తరపున రెండు యుద్ధ నౌకలు పాలుపంచుకుంటున్నాయి. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ నేవీ) 70వ వార్షిక కార్యక్రమాల నేపథ్యంలో ఐఎఫ్‌ఆర్ నిర్వహిస్తున్నారు. భారత యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్ కోల్‌కతా, ఐఎన్‌ఎస్ శక్తి ఐఎఫ్‌ఆర్‌లో భాగంగా 22, 23 తేదీల్లో జరిగే ప్రదర్శనలో పాల్గొంటాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఐఎఫ్‌ఆర్ వేడుకల్లో భాగంగా 23న వివిధ దేశాల యుద్ధ నౌకలతో జరిగే ప్రదర్శనలో పాల్గొంటారు. దేశాల మధ్య నౌకాదళ సహకారం తదితర అంశాల వేదికగా జరుగుతున్న ఐఎఫ్‌ఆర్‌లో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ కోల్‌కతా, ఐఎన్‌ఎస్ శక్తి యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన నౌకాదళ పాటవాన్ని వెల్లడించే ఈ కార్యక్రమంలో అన్ని దేశాల యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లో, ఎయిర్‌క్రాఫ్ట్‌లు పాలుపంచుంకుంటున్నాయి. 2016లో భారత్ తూర్పునౌకాదళం ఆధ్వర్యంలో విశాఖ వేదికగా ఐఎఫ్‌ఆర్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 50 దేశాలకు చెందిన సుమారు 100 వరకూ యుద్ధ నౌకలు పాల్గొన్నాయి. చైనాలో జరిగే 70వ ఐఎఫ్‌ఆర్‌లో భారత్‌కు చెందిన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్‌ఎస్ కోల్‌కతా, ఐఎన్‌ఎస్ శక్తి యుద్ధ నౌకలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఐఎన్‌ఎస్ కోల్‌కతా స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్‌గా పేర్గాంచింది. ఇక ఐఎన్‌ఎస్ శక్తి ఫ్లీట్ సపోర్టు వెసల్‌గా సేవలందిస్తోంది. ఐఎన్‌ఎస్ శక్తి సముద్రంలోనే సహ యుద్ధ నౌకలకు ఇంథనాన్ని సరఫరా చేస్తుంది. ఒకే సారి 27 వేల టన్నుల చమురు నిల్వలను ఇది మోసుకుపోగలదు. ఐఎఫ్‌ఆర్‌లో భాగంగా భారత యుద్ధనౌకలు ప్రదర్శనలో పాల్గొన్న అనంతరం ఇతర దేశాల నౌకాదళాలతో సిబ్బంది చర్చల్లో పాల్గొంటారు. అదేవిధంగా పీఎల్‌ఏ మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులతో నౌకాదళ సిబ్బంది సమావేశమవుతారు. దీనిలో భాగంగా వివిధ దేశాల మధ్య నౌకాదళ సహకారంతో పాటు సాంకేతిక సహకార మార్పిడి, వంటి అంశాలను చర్చిస్తారు.