ఆంధ్రప్రదేశ్‌

వైభవంగా రామయ్య రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, ఏప్రిల్ 19: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. ఉదయం ఆలయంలో ఉత్సవవర్లను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు, హారతులు ఇచ్చారు. అనంతరం పల్లకిలో ఉత్సవమూర్తులను మోసుకుని వచ్చి రథంపై ఆశీనులను చేసి హారతులు ఇచ్చారు. రథాంగబలి అనంతరం భక్తుల జయజయధ్వనాల మధ్య రథం ముందుకు కదిలింది. ఆలయ మాడావీధులతో పాటు పట్టణ పురవీధుల గుండా స్వామివారి రథాన్ని తిప్పారు. మధ్యాహ్నం కొద్దిసేపు నిలిపివేసి అనంతరం సాయంత్రం 5 గంటల వరకు తిరిగి కొనసాగింది. పండితుల వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయ ధ్వనాలు, కళాకారుల కోలాటాలు, భజనలు కనువిందుచేశాయి. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.
ఆత్మ రథికుడు, శరీరమే రథం. బుద్ది సారధి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూలశరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుందని రథోత్సవంలో అర్చక స్వాములు ఇచ్చిన ఆధ్యాత్మికోపాన్యాసం భక్తులను ఆకట్టుకుంది. రథోత్సవంలో ఉన్న తత్త్వజ్ఞానమిదే అని పేర్కొన్నారు. రథోత్సవంలో పాల్గొనడం వల్ల కోరిన కోరికలు తీరతాయని చెప్పారు. రథోత్సవంలో స్వామివారు ఆనందంగా ఉంటారని కనుక రథోత్సవంనాడు భక్తులను స్వామివారు అనుగ్రహిస్తారన్నారు. ఎండవేడిమి దృష్ట్యా రథోత్సవంలో పాల్గొన్న భక్తజనానికి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. రతోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్త్భివాన్ని పంచాయి. ఉదయం ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, అద్దంకికి చెందిన అన్నపూర్ణ రామాయణంలో పాత్రల విశిష్టతపై ధార్మికోపాన్యాసం చేశారు. సాయంత్రం ఎస్.మణి, టి.తేజోవతి ఊంజల్‌సేవలో భక్తి సంకీర్తనలు ఆలపించారు. రాత్రి రమణయ్య భాగవతార్ హరికథ వినిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్‌బాబు, ఏఈఓ రామరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.