ఆంధ్రప్రదేశ్‌

ఆంగ్ల విధానంతో అభ్యర్థుల పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 19: రాష్ట్రంలో వివిధ క్యాడర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీపీఎస్సీ) ఉద్యోగ పరీక్షలను తెలుగులో నిర్వహించాలని లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖలో లోక్‌నాయక్ ఫౌండేషన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీపీఎస్సీ పరీక్షలకు హజరయ్యే అభ్యర్థులకు ప్రశ్నాపత్రం ఆంగ్లంతో పాటు, తెలుగులోనూ ఉంటుందని భావిస్తారని,అయితే పరీక్షల పత్రం మాత్రం కేవలం ఆంగ్లంలోనే ఉండటంతో తెలుగు మీడియం విద్యార్థులంతా చాలా ఇబ్బందికరంగా మారి తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ప్రభుత్వం విడుదల చేసే ఉత్తర్వులు, నామఫలకాలు, ఆహ్వనపత్రాలు ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ ప్రచురించాలని గతంలో అనేక సార్లు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ నేటికి ఏక్కడా అమలు జరగడం లేదున్నారు. ఇదే విధానం కొనసాగితే భవిష్యత్‌లో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష ఉనికి లేకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని పోటీ పరీక్షలను ఆంగ్లంతో పాటు తెలుగులోనూ ప్రశ్నాపత్రాలను ఇవ్వాలని లేకుంటే రాష్టవ్య్రాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం వివిధ కేటగిరిల్లో 40వేల ఉద్యోగులతో పాటే 20వేల ఉపాధ్యాయు పోస్టులు, 14వేల పోలీస్ పోస్టులను భర్తీ చేసిందని, ఏపీలో మాత్రం కేవలం ప్రచార ఆర్భాటాలు తప్ప ఆశించిన స్థాయిలో పోస్టుల భర్తీ కాలేదున్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు లేకపోవడంతో నిరుద్యోగ సమస్య మరింత పెరిగిందని ఆరోపించారు.