ఆంధ్రప్రదేశ్‌

వీపీటీని సందర్శించిన బంగ్లాదేశ్ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 20: విశాఖ పోర్టును బంగ్లాదేశ్ ప్రతినిధి బృందం శనివారం సందర్శించింది. బంగ్లాదేశ్ ఫారిన్ ట్రేడ్ ఇనిస్టిట్యూట్ (బీఎఫ్‌టీఐ) ముఖ్యకార్య నిర్వాహణ అధికారి అలీ అహ్మద్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందానికి విశాఖ పోర్టుట్రస్టు (వీపీటీ) చైర్మన్ ఎంటీ కృష్ణబాబు ఘన స్వాగతం పలికారు. విశాఖ పోర్టులో కార్గో హ్యాండ్లింగ్, ఆపరేషన్స్, అందుబాటులోని వౌలిక సదుపాయాలు తదితర అంశాలను ఈ బృందం స్వయంగా పరిశీలించింది. అలాగే పోర్టు ద్వారా జరుగుతున్న ఎగుమతులు, దిగుమతుల అంశాలను బృందం పరిశీలించింది. అనంతరం వీపీటీ చైర్మన్ కృష్ణబాబు బంగ్లాదేశ్ ప్రతినిధులకు పోర్టు కార్యకలాపాలు, ఇతర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాల సరకు రవాణా విషయంలో చేసుకున్న కోస్టల్ షిప్పింగ్ ఒప్పందంపై చర్చించారు. బంగ్లాదేశ్‌కు చెందిన సరకు రవాణాకు తూర్పు తీరంలో విశాఖ పోర్టును వినియోగించుకోవాలని కోరారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య సరకు రవాణా అంశాలపై ఉన్న ఒప్పందాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
చిత్రం... బంగ్లాదేశ్ ప్రతినిధి బృందంతో చర్చిస్తున్న వీపీటీ చైర్మన్ కృష్ణబాబు