ఆంధ్రప్రదేశ్‌

ఎంసెట్ ప్రశ్నాపత్రం సెట్ కీ కోడ్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 20: అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉభయ రాష్ట్రాల్లో ఏపీ ఎంసెట్- 2019 పరీక్షలను కాకినాడ కేంద్రంగా జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూకే) నిర్వహిస్తోందని, ప్రత్యేకించి ఆన్‌లైన్ విధానంలో మూడో సారి నిర్వహిస్తోందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎస్ విజయరాజు పేర్కొన్నారు. జేఎన్‌టీయూకే సెనేట్ హాలులో శనివారం ఉదయం ఎంసెట్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాల సెట్ కోడ్ కీ నెంబర్లను ప్రొఫెసర్ విజయరాజు విడుదల చేశారు. ఉదయం సెషన్‌కు ఈజీ- 02, మధ్యాహ్నం సెషన్‌కు ఈజీ- 18 కోడ్ నెంబర్ల సెట్లను వినియోగించాలని సమావేశం ద్వారా పరీక్షా సెంటర్లకు వర్తమానం పంపారు. ఈ సందర్భంగా విజయరాజు మాట్లాడుతూ అనుభవజ్ఞులు, నిబద్ధతతో కూడిన విధి నిర్వహణ చేసే అధికారులు ప్రత్యేకించి నీతి నిజాయితీలతో వ్యవహరించేవారు ఈ కమిటీలో సభ్యులుగా ఉండడం వల్ల పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఎటువంటి గందరగోళం లేకుండా సజావుగా సాగుతోందని అన్నారు.ఇకపై కూడా జేఎన్‌టీయూకే ఆధ్వర్యంలోనే ఎంసెట్ పరీక్షలు జరగాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు వైస్ ఛాన్స్‌లర్, ఎంసెట్- 2019 ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం రామలింగరాజు మాట్లాడుతూ 109 కేంద్రాలు ఏపీలో, 6 కేంద్రాలు హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రాధమిక కీ 23న, మెడికల్ తదితర పరీక్షలకు సంబంధించి కీ 24న వెబ్‌సైట్‌లో ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అదే విధంగా ఫలితాల వెల్లడి మే 2వ వారానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నామన్నారు. ఒక కన్వీనర్, ఇద్దరు కో- కన్వీనర్లు 15 మంది సభ్యులతో ఎంసెట్- 2019 పరీక్ష నిర్వహణకు నిరంతరం కమిటీ కృషి చేస్తుందన్నారు. 7 సెషన్స్‌లో ఒక్కొక్క సెషన్‌కు 29 వేల మంది పరీక్షార్ధులుగా ఆన్‌లైన్‌లో పరీక్షలు రాసేందుకు సర్వం సిద్ధం చేసినట్లు వెల్లడించారు. పరీక్షల కన్వీనర్ ప్రొఫెసర్ సిహెచ్ సాయిబాబు, కో- కన్వీనర్లు ఆర్ శ్రీనివాసరావు, నాగరాజు, సభ్యులు దీక్షితులు, వెంకటరెడ్డి, రిజిష్ట్రార్ సుబ్బారావు, ఎంసెట్ ప్రత్యేక అధికారి డాక్టర్ రఘునాధ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చిత్రం... ఎంసెట్ ప్రశ్నాపత్రం సెట్ కోడ్ కీని విడుదల చేస్తున్న ప్రొఫెసర్ విజయరాజు, వీసీ రామలింగరాజు