ఆంధ్రప్రదేశ్‌

కొలంబో ఘటనలో ‘అనంత’ వాసులకు త్రుటిలో తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 21 : పవిత్ర ఈస్టర్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్న తరుణంలో శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం ఉదయం ముష్కరులు జరిపిన వరుస పేలుళ్ల ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన నలుగురు యాత్రికులు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం టీడీపీ నేత, ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత అమిలినేని సురేంద్రబాబు, అతడి మిత్రులు వెంకటేశ్, రాజగోపాల్, మహీధర్‌రెడ్డి విహార యాత్రకు శ్రీలంక వెళ్లారు. ఈ క్రమంలో శనివారం వారు కొలంబో చేరుకున్నారు. సోమవారం వారు జిల్లాకు తిరిగి రావాల్సి ఉంది. అయితే హోటళ్లు, చర్చిలు లక్ష్యంగా ముష్కర మూకలు జరిపిన వరుస పేలుళ్లలో సురేంద్రబాబు ముక్కుకు స్వల్ప గాయమైంది. మిగతా వారూ సురక్షింతంగా బయటపడ్డారు. సురేంద్రబాబు మేనల్లుడు దేవినేని ధర్మతేజ తెలిపిన వివరాల మేరకు.. కొలంబోలోని షాంగ్రిలా హోటల్‌లోని 24వ అంతస్థులో సురేంద్రబాబు మిత్రులతో కలిసి బస చేశారు. ఆదివారం ఉదయం 8.45 గంటల సమయంలో మూడో అంతస్థులోని హోటల్‌కు అల్పాహారం తినడానికి వచ్చారు. ఆ సమయంలో హోటల్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. దీంతో భయంతో జనం పరుగులు తీశారు. పేలుళ్లలో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. పరుగులు తీస్తున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో సురేంద్రబాబు ముక్కుకు స్వల్ప గాయమైంది. మిగిలిన ముగ్గురు మిత్రులూ క్షేమంగా బయటపడ్డారు. వరుస పేలుళ్లలో 215మందికి పైగా మృత్యువాత పడగా, 300 మందికి పైగా తీవ్రంగా గాయపడిన ఈ దుర్ఘటన భయకంపితులను చేసింది. ఈ ఘటన అనంతరం ఉదయం 9.30 గంటల సమయంలో తన కుటుంబ సభ్యులతో మాట్లాడిన సురేంద్రబాబు.. తమ కళ్ల ముందే 10 మంది మృత్యువాతపడడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యామని వాపోయారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు. అనంతపురం జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ కూడా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా వారి పాస్‌పోర్టులు, ఇతర రికార్డులు అన్నీ హోటల్ గదిలోనే ఉన్నట్లు సమాచారం. కాగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో నేడు వారంతా అనంతపురం వస్తున్నట్లు సురేంద్రబాబు కుటుంబ సభ్యులు తెలిపారు.

చిత్రం... కొలంబో ఘటనలో గాయపడిన టీడీపీ నేత అమిలినేని సురేంద్రబాబు