ఆంధ్రప్రదేశ్‌

ప్రజాచైతన్యానికి దోహదపడేదే పబ్లిక్ రిలేషన్స్ విభాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 21: ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యం తేవడానికి ఉపయోగపడేదే పబ్లిక్ రిలేషన్స్ విభాగమని సీనియర్ సంపాదకులు సీ రాఘవాచారి అన్నారు. ఆదివారం పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్‌ఎస్‌ఐ) అమరావతి చాప్టర్ 33వ నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్టీఆర్ పరిపాలన భవనంలోని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ అభిప్రాయ బలం చాలా ముఖ్యమైనదని, ఆయా అభిప్రాయాలపై వచ్చిన రాజ్యవ్యవస్థే ప్రజాస్వామ్యమని చెప్పారు.
చట్టాలు అమలు చేసేవారికి, వాటి ఆవశ్యకత గురించి తెలుసుకునే వారికి మధ్య వారధిగా పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఉంటుందన్నారు. శాస్త్ర, సాకేతిక రంగాలతో నేడు మీడియా చాలా వేగంగా విస్తరించడంతో పాటు వార్తలను అందించడంలో సోషల్ మీడియా ముందుంటోందన్నారు. ప్రముఖ వ్యవసాయ శాస్తవ్రేత్త డా. ఏ సత్యనారాయణ మాట్లాడుతూ 75శాతం మంది నేటికీ దేశంలో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, 62శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా వ్యవసాయంపై ఆధారపడ్డారన్నారు. పీఆర్‌ఎస్‌ఐ అమరావతి చాప్టర్ అధ్యక్షుడు వీఎస్‌ఆర్ నాయుడు మాట్లాడుతూ పీఆర్‌ఎస్‌ఐని 1958, ఏప్రిల్ 21న ముగ్గురు ప్రొఫెషనల్స్‌తో న్యూఢిల్లీలో ప్రారంభించినట్లు తెలిపారు. పీఆర్‌ఎస్‌ఐ అమరావతి సెక్రటరీ, సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ పీ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ మహాభారతంలో ధృతరాష్ట్రుడికి సమాచారం అందించిన మొదటి వ్యక్తిగా సంజయుడు నిలుస్తాడన్నారు. నేటి సమాజంలో సోషల్ మీడియా చాలా యాక్టివ్ రోల్‌ను పోషిస్తోందని వివరించారు. కార్యక్రమంలో నాగార్జన విశ్వవిద్యాలయం జర్నలిజం శాఖ విభాగాధిపతి డా. జీ అనిత, ఐ అండ్ పీఆర్ పీఆర్వో ఎస్ రమేష్, పీఆర్‌ఎస్‌ఐ సభ్యులు పాల్గొన్నారు.
చిత్రం... కార్యక్రమంలో మాట్లాడుతున్న సీనియర్ సంపాదకుడు సీ రాఘరాచారి