ఆంధ్రప్రదేశ్‌

నేడు టీడీపీ అభ్యర్థులతో చంద్రబాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 21: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య పరిణామాలపై తెలుగుదేశం పార్టీ కూడికలు, తీసివేతలు మొదలెట్టింది. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, తమకు 110 నుంచి 140 సీట్ల వరకు రావటం ఖాయమని ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓటర్లు గుంభనంగా ఉన్న నేపథ్యంలో నిశ్శబ్ద విప్లవం ఎవరికి అనుకూలిస్తుందోననే అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. రాష్ట్రం మొత్తంగా 79.69 శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్‌కు ముందు, తరువాత ఎగ్జిట్ పోల్ సర్వేలతో సహా పూర్తిస్థాయిలో చంద్రబాబు విశే్లషణలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్థులతో కలిసి ఆయన సమీక్షించనున్నారు. సోమవారం ఉదయం 10గంటలకు ఉండవల్లి ప్రజావేదిక సమావేశ మందిరంలో టీడీపీ అభ్యర్థులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. నియోజకవర్గాల వారీగా ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు, జయాపజయాలపై ఓ నిర్ణయానికి రావాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. జనసేన ఓటింగ్ ఎవరిని ప్రభావితం చేయనుంది? పెరిగిన ఓటింగ్ శాతం, నియోజకవర్గాల్లో మండలాలు, గ్రామాల వారీగా పోలింగ్ సరళిని విశే్లషించి ఈ సమావేశంలో ఓ అంచనాకు రానున్నారు.