ఆంధ్రప్రదేశ్‌

హోదా నినాదం ఢిల్లీని తాకాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 1: పార్లమెంట్‌లో, టిడిపి ప్రభుత్వంలో కదలిక రావటంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అన్ని వర్గాల ప్రజలు ఒకే గొంతుతో నినదించి, మంగళవారం బంద్‌కు మద్దతు తెలపాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడలోని దాసరి భవన్‌లో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, రావుల వెంకయ్యతో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, విద్యార్థులు, యువజనులు ముందుకొస్తున్నారని, రెండేళ్లు గడిచిన తర్వాత అయినా ఇప్పుడు పార్లమెంట్‌లో టిడిపి ఎంపీలు గట్టిగా నిలబడడం, వైఎస్‌ఆర్‌సిపి ఎంపిలు కూడా ముందుకు రావడం సంతోషదాయకమన్నారు. ప్రత్యేక హోదా సాధనకు ఇదే తగిన సమయమని, కేంద్రంలో అన్ని రాజకీయ పార్టీలు ముందుకొస్తున్నాయని, రాష్ట్రంలో కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు రాజకీయాలకు అతీతంగా బంద్‌లో పాల్గొని ప్రత్యేక హోదా నినాదం ఢిల్లీని తాకేలా పోరాడాలన్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని చంద్రబాబు, ప్యాకేజీలు ఇస్తున్నాం కదా అని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల పాటు విభజన హామీలు అమలు చేయకుండా తాత్సారం చేశారని ఆయన విమర్శించారు. రూ.16వేల కోట్లు లోటు బడ్జెట్ అందించాల్సి వుండగా రూ.2,803 కోట్లు మాత్రమే ఇచ్చారని, ఇక ప్యాకేజీలు ఏం ఇస్తారని ప్రశ్నించారు. 30సార్లు ప్రధానిని కలిశానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుంటారని, కేంద్ర ప్రభుత్వం ఏం ఇచ్చిందో చెప్పాలని ఆయన నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణాలకు తగినన్ని నిధులు ఇచ్చిందా? కడపకు స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చిందా? విశాఖ రైల్వేజోన్ ఇచ్చిందా? ఏం ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధన కోసం కమ్యూనిస్టు పార్టీ మొదటి నుండి పోరాటం చేస్తూనే వుందన్నారు.