ఆంధ్రప్రదేశ్‌

కొందరి వల్ల న్యాయ వ్యవస్థకు మచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 23: భారతదేశంలో న్యాయవ్యవస్థ ఎంతో ఉన్నతమైనదని, అయితే నేడు దేశంలోని న్యాయవ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని, కొంతమంది న్యాయమూర్తుల వల్ల ఎంతో శక్తివున్న న్యాయవ్యవస్థ బలహీనపడుతోందని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు సిజెపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయనంత ఆయనే క్లీన్‌చిట్ ఇచ్చుకోవడం విడ్డూరమనిపించిందన్నారు. దళిత మహిళ ఆరోపణలపై ధర్మాసంలోని 22 మంది న్యాయమూర్తులు కూర్చుని తీర్పు ఇవ్వాలని కోరుతున్నానన్నారు. అవసరమైతే పార్లమెంట్ కూడా ఈ అంశంపై దృష్టిపెట్టాల్సి ఉందన్నారు. నిందలు వచ్చినప్పుడు ఎంతటి వారైనా పరీక్షలు ఎదుర్కోక తప్పదన్నారు. దళిత మహిళ భర్తకు ఉద్యోగం పునరుద్ధరించాలని చింతా డిమాండ్ చేశారు. ఇదిలావుండగా టీటీడీలో జరిగే డిపాజిట్లలో కూడా ముడుపులు వస్తున్నాయని తనకు తెలుసన్నారు. దాదాపు రూ. 10వేల కోట్ల నిధులు డిపాజిట్ల రూపంలో మారుతున్నాయన్నారు. వీటి ద్వారా వచ్చే కమీషన్లు ఎవరు తీసుకుంటున్నారన్నది తేలాల్సిన అంశంమన్నారు. వీటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితీరాలన్నారు. టీటీడీ ఖజానా నుంచి బంగారు వెలుపలికి వెళ్లాలన్నా, లోపలికి రావాలన్నా రిజర్వ్‌బ్యాంక్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి ఉండాలని, ఆ అనుమతి పత్రాలను 24 గంటల్లోగా ఈఓ చూపించాలన్నారు. వీటికి ఆధారాలు చూపించకపోతే ఈఓ సెలవుపై వెళ్లాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో వందల సంఖ్యలో బ్యాంకులున్నాయని, ఇక్కడి బ్యాంకుల్లో కాకుండా పొరుగు రాష్ట్రాల్లో పెట్టాల్సిన అవసరం ఏముందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.