ఆంధ్రప్రదేశ్‌

కరవు సహాయక చర్యలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 23: రాష్ట్రంలోని వేసవి తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో కరవు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ మంగళవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్యలు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. వేసవి తీవ్రత అధికంగా ఉన్న కరవుపీడిత ప్రాంతాలలో ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం, కుటుంబానికి రూ. 5వేలు ఆర్థిక సహాయం అందించాలని, పశువులకు నీటిని అందించేందుకు నీటి తొట్టెలు ఏర్పాటు, పశుగ్రాసం సరఫరా చేయడంతోపాటు తాగునీటి ఎద్దడి నివారణకై యుద్ధప్రాతిపదికన తగు చర్యలు చేపట్టవలసిందిగా రామకృష్ణ కోరారు.