ఆంధ్రప్రదేశ్‌

సమీక్షలు నిర్వహిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 23: విధాన పరమైన నిర్ణయాలు మినహా ప్రభుత్వం మామూలుగానే విధులు నిర్వహించవచ్చని ఎన్నికల సంఘం చెబుతున్నా, ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమీక్షలను వైకాపా నేతలు తప్పుపట్టడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన శాఖకు సంబంధించి వ్యవసాయం, రైతులకు సంబంధించి సమీక్షలు నిర్వహించి తీరతానని స్పష్టం చేశారు. ఎవరైనా అడ్డుకుంటే ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రిగా తాను చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. రైతులు తమ సమస్యల పరిష్కారానికి ఎవరి వద్దకు పోవాలని ప్రశ్నించారు. విపత్తు సమయంలో తమ విధులు నిర్వహిస్తామని, ప్రభుత్వం లేకుండా అధికారులు నిర్ణయాలు తీసుకోగరలా అని ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదంటే, ఎన్నికల కమిషన్ రూల్ పొజిషన్ నిబంధనల వివరాలు చూపించాలన్నారు. పరిపాలనను స్తంభింప చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు, అధికారులను అడ్డుకునే అధికారం ప్రధాన కార్యదర్శికి లేదన్నారు. సమీక్షలు నిర్వహించే అధికారం తనకు ఉందని స్పష్టం చేశారు. తమది ఆపద్ధర్మ ప్రభుత్వం కాదన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, ఐదు సంవత్సరాలు పరిపాలించమని ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత వివిధ శాఖలతో సమీక్ష నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది పరిపాలించాలని వైకాపా నేతలు కోరుకోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తేనో, బలపరీక్షలో ఓడిపోతేనో, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ అపద్ధర్మ ప్రభుత్వం ఉంటుందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల 17 మంది విద్యార్థులు చనిపోయారని, దీనికి కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెబుతుందా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా, బీజేపీ నేతలు రాష్ట్రంలోని వ్యవస్థలను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
వివిధ పార్టీలు మారిన ఆనం రామనారాయణ రెడ్డి ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఆరోపించారు. టీటీడీ బంగారం వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయాలనడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శమని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, మంత్రివర్గ సమావేశాన్ని మోదీ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. పోలవరం ముంపును తగ్గించేందుకు డిజైన్ మార్చామని, దీని వల్ల తెలంగాణలో ముంపు తగ్గుతుందని, వారికి ఎటువంటి నష్టం ఉండదన్నారు. కేసీఆర్, మోదీ ఎన్ని కుతంత్రాలు చేసినా, తాము తిరికి అధికారంలోకి రావడం తథ్యమని స్పష్టం చేశారు.