ఆంధ్రప్రదేశ్‌

ఆర్థిక దుస్థితి పాపం మోదీ, జగన్‌దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలవటానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాపమే కారణమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు మోదీ, కేసీఆర్, జగన్ కుట్రకు తెరలేపారని మండిపడ్డారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను అడ్డుకున్నారని, విభజన చట్ట రీత్యా రావాల్సిన బకాయిలు రానివ్వలేదని, వివిధ పథకాల కింద ఏపీకి నిధులు కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. కేంద్ర నిధులను అడ్డుకోవటమే లక్ష్యంగా జగన్ అండ్ కో ఫిర్యాదులు చేసిందని మంగళవారం ఒక ప్రకనటలో యనమల ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ ఎంపీలతో కేంద్రానికి ఫిర్యాదులు చేయించి చివరకు కూలీలకు అందించే ఉపాధి హామీ నిధుల్లో కూడా అడ్డుపడి పేదల పొట్టకొట్టారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రధాని కార్యాలయంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తిష్టవేసి అపోహలు పెంచారని, గుజరాత్‌ను మించి ఆంధ్ర అభివృద్ధి చెందుతోందనే అక్కసుతో మోదీ, వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, అవినాష్‌రెడ్డి కేంద్రానికి అనేక ఫిర్యాదులు పంపారని వీరి స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జగన్ దుర్బుద్ధి వల్లే ఏపీ ఆర్ధిక పరిస్థితి కుదేలైందని విమర్శించారు. ఇది వైసీపీ, బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్టన్నారు. అయినప్పటికీ టీడీపీ ప్రభుత్వం స్థానిక వనరులను సమీకరించి పేదల సంక్షేమంతో పాటు అభివృద్ధి పథకాలను పెద్దఎత్తున చేపట్టిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు 70 శాతం పూర్తిచేశామని, 23 ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరుగుతోందని వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంతో సాగుతున్నాయని చెప్పారు. గత ఐదేళ్లలో ఆశించిన స్థాయిలో పన్నుల రాబడి పెరగలేదని చెప్తూ మూలధన వ్యయం, రెవెన్యూ వ్యయం పెరిగాయన్నారు. ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోస్ మధ్య ఆంతర్యం పెరిగిందని చెప్పారు. ఆర్బీఐ నుంచి కంటింజెన్సీ నిధులపై కేంద్రంలో మోదీ ప్రభుత్వం కనే్నసిందని సుమారు రూ 1.5 ట్రిలియన్ డాలర్లు (దాదాపు లక్షన్నర కోట్లు) కేంద్రం తీసుకుందని ఆరోపించారు. ఆ నిధులు రాష్ట్రాలకు ఇవ్వకుండా ఆర్బీఐకి అడుగడుగునా అవరోధాలు సృష్టించారని, ఆర్బీఐతో రాష్ట్రాలకు ఉన్న సంబంధాలను దెబ్బతీశారని విమర్శించారు. అటు ఉద్యోగులు, ఇటు పేదల సంక్షేమానికి పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టామని 24 అంశాలపై నిర్ణయాలు తీసుకుని ఉద్యోగుల సంక్షేమాన్ని పూర్తి చేశామన్నారు. రాబడులు, వ్యయంలో అంతరాన్ని భర్తీ చేసేందుకు అప్పులకు వెళ్లాల్సి వస్తుందని చెప్తూ జీఎస్డీపీలో 3 శాతం పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచాలని కోరినప్పటికీ బీజేపీ నేతలు స్పందించలేదన్నారు. తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, రాష్ట్రాలకు మాత్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి పెంచారని గుర్తుచేశారు.
ఏపీకి మోకాలడ్డటంతో విభజన దరిమిలా 13 జిల్లాలపై రూ. 97వేల 163 కోట్ల భారం పడిందన్నారు. ఇదికాక 1956 నుంచి వచ్చిన అప్పుల భారాన్ని కూడా కొత్త రాష్ట్రం భరిస్తోందని, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వం అప్పులు కూడా చెల్లిస్తున్నామని వివరించారు. అవుట్ స్టాండింగ్ అప్పుల భారం ఈ ఏడాది మార్చి నాటికి 1,92,687 కోట్లు కాగా, జనాభా ప్రాతిపదికన అప్పులను ఏపీ సర్కార్ మోస్తోందని చెప్పారు. ఈ ఐదేళ్లలో రూ 95,564 కోట్ల అప్పుల భారం పడిందని, సగటున ఏడాదికి రూ 19,111 కోట్ల రుణభారం రాష్ట్రంపై పడుతోందని తెలిపారు. తొలి ఏడాది ఆర్థికలోటు రూ 16వేల కోట్లు కేంద్రం భరిస్తే 80 శాతం భారం నుంచి విముక్తి లభించేందని అలాంటిది ఏడాదికి రూ 500 కోట్లు మరో ఏడాది రూ వెయ్యి కోట్ల చొప్పున గత ఐదేళ్లలో రూ 4వేల కోట్లే ఇచ్చారన్నారు. ఇంకా కేవలం రూ 139 కోట్లు మాత్రమే ఇస్తామని మోదీ అక్కసు వెళ్లగక్కారన్నారు. 14వ ఆర్థిక సంఘం లెక్కల్లో లోపాల వల్ల ఏపీకి ఐదేళ్లలో రూ 20వేల కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ లోపభూయిష్ట కేటాయింపుల వల్ల లక్ష కోట్లకు పైగా నష్టం సంభవించిందని, ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లామన్నారు. దీనిపై యాగీ చేయటం హాస్యాస్పదమన్నారు. గతానికి భిన్నంగా ఐదేళ్లలో కాపిటల్ ఎక్స్‌పెండిచర్ పెరిగిందన్నారు. కొత్త రాష్ట్రం కావటంతో పాటు రాజధాని నగర నిర్మాణ వ్యయం, ప్రాజెక్ట్‌ల నిర్మాణ ఖర్చులు పెరిగాయని, రూ. 70 వేల కోట్లు నీటిపారుదల ప్రాజెక్ట్‌లకు కేటాయించామన్నారు. ప్రభుత్వ చర్యలతో అన్నింటినీ సమతుల్యం చేసుకుంటూ రాష్ట్ర వృద్ధిరేటు పెంచటం వల్ల మోదీ, కేసీఆర్, జగన్ కళ్లు రాష్ట్రంపై పడ్డాయని విమర్శించారు. ఆ మూడు పార్టీల దుర్మార్గ పోకడలను ప్రజలు వ్యతిరేకించారనటానికి సార్వత్రిక ఎన్నికలే నిదర్శనం కానున్నాయని ధీమా వ్యక్తంచేశారు.