ఆంధ్రప్రదేశ్‌

ఆయేషా కేసు దర్యాప్తులో సీబీఐ మరో ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 24: విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ మరో అడుగు ముందుకేసింది. విచారణలో భాగంగా ఆయేషా మీరా హత్య జరిగిన సమయంలో ఇక్కడ పనిచేసిన పోలీసులను సీబీఐ అధికారులు విచారించారు. కానిస్టేబుల్ రామారావు, శంకర్, రాధాల స్టేట్‌మెంట్లు నమోదు చేశారు. హత్య జరిగిన సమయంలో దర్యాప్తు తీరు, గుర్తించిన ఆధారాల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఘటనాస్థలిలో దొరికిన ఆనవాళ్లపై సీబీఐ నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీబీఐ విజయవాడ కోర్టు సిబ్బందిపై రెండు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయేషా కేసుకు సంబంధించి కొన్ని రికార్డులు విజయవాడ కోర్టులో ధ్వంసం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు విచారణను సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా ఇబ్రహీంపట్నంలోని దుర్గా హాస్టల్‌లో 2007 డిసెంబర్ 27న అత్యాచారం, హత్యకు గురికాగా, ఈ కేసు దర్యాప్తు గత 12సంవత్సరాలుగా ఎన్నో మలుపులు తిరుగుతోంది.