ఆంధ్రప్రదేశ్‌

హోదాపై విపక్షాలది ‘రాజకీయం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), ఆగస్టు 1: ఆంధ్రప్రదేశ్ ప్రజల బలమైన కోరికైన ప్రత్యేక హోదా అంశాన్ని విపక్షాలు రాజకీయం చేసి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర విమర్శించారు. ఏపికి న్యాయం జరగాలనే చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ఆందోళనలు చేయాలని, నిరసనలు తెలపాలని, రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని ప్రయత్నించవద్దని హితవు పలికారు. సోమవారం నగరంలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రత్యేక హోదా ఆర్థికపరమైన అంశమని కేంద్రం కుంటిసాకులు చెబుతోందని, కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే జరగని పనులను ఉంటాయా? అని వారు ప్రశ్నించారు. కోరుకోని విభజన జరిగిన సమయంలో అన్యాయం జరిగిన సందర్భంలో న్యాయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా విభజనకు కారకులైన వారిపై ఎక్కువుగా ఉంటుందని తెలిపారు. విభజనకు కారుకులైన వారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహానికి గురయ్యారని, ఇలాంటి పరిస్థితి నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చుకోదని వారు అభిప్రాయపడ్డారు. హోదా కోసం ఎక్కడా రాజీపడే ప్రసక్తి లేదని, ఇదే సమయంలో తమ నిరసనను దశలవారీగా తెలిపేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రజయోజనాలే తమ పార్టీ నాయకులకు ముఖ్యమని, పదవులు ముఖ్యంకాదని వారు స్పష్టం చేశారు. విపక్షాలు కూడా రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి హోదా కోసం కలిసిరావాలని, కేంద్రంపై తమ ప్రయత్నంగా ఒత్తిడి తీసుకొస్తున్నట్లు, అవసరమైతే రాష్ట్రంలోని విపక్షాలతో కలిసి కేంద్రాన్ని కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్ కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడే తప్ప రాష్ట్ర ప్రజయోజనాల కోసం అలోచించడం లేదని వారు ఆరోపించారు. హోదా అంశంలో జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే ప్రధాని వద్ద ఆందోళన, నిరసన తెలపాలని, బంద్‌లతో రాష్ట్భ్రావృద్ధికి అడ్డుపడవద్దని హితవు పలికారు. మిత్రపక్షంగా ఉన్న తాము సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తున్నామని, తగిన సమయం వచ్చినప్పుడు సరైన రాజకీయ నిర్ణయం తీసుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు.