ఆంధ్రప్రదేశ్‌

మంత్రివర్గ నిర్ణయాల్ని ప్రశ్నించే హక్కు సీఎస్‌కు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 24: రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి లేదని రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు అన్నారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అప్రకటిత రాష్టప్రతి పాలనను ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ సెకండ్ సిటిజన్‌గా మారారా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమన్నారు. దొడ్డిదారిన సీఎస్‌గా వచ్చిన ఆయనకు మంత్రివర్గ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఎవరిచ్చారన్నారు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమీక్షించాలని, కానీ సీఈవో సెకండ్ సిటిజన్‌గా మారినట్లు కనిపిస్తోందన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారమూ సీఎస్‌కు లేదని, సీఈవో అడిగిన సమాచారం మాత్రమే ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రిపై అవాకులు, చవాకులు పేలుతూ రిటైర్డ్ సీఎస్‌లు ఒక పార్టీ కార్యకర్తల్లా మాట్లాడుతున్నారని జూపూడి ధ్వజమెత్తారు.