ఆంధ్రప్రదేశ్‌

సంక్షేమ పథకాలకు నిధులపై సీఎస్ తీరు ప్రజావ్యతిరేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 24: సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తీరు ప్రజావ్యతిరేకం, అనైతికమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ నిరసన తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న టీడీపీ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకానికి ఎప్పుడెప్పుడు ఎంతెంత నిధులు విడుదల చేయాలనే అంశాన్ని గతంలోనే స్పష్టం చేసిందని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సైతం విడుదల చేసిందన్నారు. బడ్జెట్‌లోనూ కేటాయింపులు జరిపినట్లు చెప్పారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడమే అధికారుల విధి అని స్పష్టం చేశారు. ఈ నెల 11న జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపుపై సీఎస్ బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించడాన్ని తప్పుబట్టారు. ఓట్ల లెక్కింపునకు, సీఎస్‌కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. సంబంధిత శాఖల అధికారులు సమీక్షకు హాజరుకావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమాచారం ఇవ్వడం వింతగా ఉందన్నారు. దీనిపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, మరోవైపు తాగునీటి సమస్య నెలకొందని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇలాంటి సమస్యలపై సీఎస్ ఎందుకు సమీక్షలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత జగన్ స్విస్ బ్యాంకుల్లోని తన ఖాతాల్లో నగదు లావాదేవీల వివరాలు తెలుసుకునేందుకే స్విట్జర్లాండ్ వెళ్లారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 23మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే విద్యాదానం చేస్తున్న వ్యక్తులు ఎందుకు స్పందించలేదని రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు.