ఆంధ్రప్రదేశ్‌

జగన్, విజయసాయి బెయిల్ రద్దుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 24: నిబంధనలను పాటించని వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, జగన్‌ల బెయిల్‌ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సీ కుటుంబరావు అన్నారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఆయన బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ వారిద్దరూ బెయిల్ నిబంధనలు పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. చార్టెర్డ్ అకౌంటెంట్ కమ్యూనిటీకి విజయసాయిరెడ్డి చీడపురుగని విమర్శించారు. తనపై ట్విట్టర్‌లో అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఖండించారు. కనీసం పబ్లిక్ ట్రేడ్ కాని కంపెనీ జగతి పబ్లికేషన్స్ షేర్స్ వాల్యుయేషన్ పెంచి 350 రూపాయలకు కొనిపించారని ఆరోపించి ప్రజలను మోసం చేశారన్నారు. ఆయన ఒక ఫ్రాడ్ చార్టెర్డ్ అకౌంటెంట్ అని విమర్శించారు. క్షణికావేశంలో మర్డర్ చేస్తారని, కానీ ఎంతో ఆలోచించి ఆర్థిక నేరాలకు పాల్పడతారని సుప్రీం కోర్టు ఆయనను ఉద్దేశించి వ్యాఖ్యానించడాన్ని గుర్తుచేశారు. జగన్, విజయసాయిరెడ్డి కేసులు సాగదీయకుండా చేస్తే వారిద్దరి బండారం బయట పడుతుందన్నారు. వారి అవినీతి బయటపడి శిక్షపడుతుందనే భయంతో రోజుకు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి దేశంలోనే ఖరీదైన లాయర్లను పెట్టుకుంటున్నారన్నారు. వారిద్దరూ శవాలపై పేలాలు ఏరుకునే బ్యాచ్ అంటూ మండిపడ్డారు. విజయసాయిరెడ్డికి మెంటల్ సిక్‌నెస్ ఉందన్నారు. తాను స్టాక్ బ్రోకర్‌గా పనిచేశానని, తనపై కేసులు లేవన్నారు. తనపై ఏమైనా ఆరోపణలుంటే నిరూపించాలన్నారు. తెలంగాణ సోషల్ మీడియా భాషలో ఆయన ఎల్-3 అని కుటుంబరావు ఎద్దేవా చేశారు.