ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన ఏపీ ఎంసెట్-2019

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 24: కాకినాడ జేఎన్‌టీయూకే ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా నిర్వహించిన ఏపీ ఎంసెట్-2019 గురువారంతో పూర్తయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లోని 42 రీజినల్ సెంటర్లలో 109 పరీక్షా కేంద్రాలు, హైదరాబాద్‌లో మూడు రీజినల్ సెంటర్లలోని ఆరు పరీక్షా కేంద్రాల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో ప్రవేశ పరీక్షలు పూర్తి ఆన్‌లైన్ విధానంలో నిర్వహించారు. మొత్తంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగాల్లో 10 సెషన్లలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలకు 2,82,901 మంది హాజరుకావలసి ఉండగా, 94.6 శాతం 2,67,627 మంది హాజరయ్యారు. 15,274మంది గైర్హాజరయ్యారని ఎంసెట్ ఛైర్మన్, జేఎన్‌టీయూకే ఉప కులపతి ప్రొఫెసర్ ఎం రామలింగరాజు, కన్వీనర్ ప్రొఫెసర్ సిహెచ్ సాయిబాబు తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం ఏడు సెషన్లలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 1,95,908 మంది హాజరు కావలసివుండగా 94.79 శాతం మంది 1,85,711 మంది హాజరయ్యారు. 10,197 మంది గైర్హాజరయ్యారు. ఇక అగ్రికల్చర్, మెడికల్ విభాగానికి సంబంధించి ఆఖరి రోజైన బుధవారం ఉదయం 30,018 మంది హాజరు కావలసివుండగా, 94.92 శాతం 28,495మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌కు 27,611 మందికి గాను 94.37 శాతం 26,057 మంది హాజరయ్యారు.
బుధవారం మధ్యాహ్నంతో పూర్తయిన అగ్రికల్చర్, మెడికల్ ప్రవేశ పరీక్షకు సంబంధించి సెషన్ల వారీ మాస్టర్ ప్రశ్నాపత్రాలు, వాటి ప్రాథమిక కీలను గురువారం ఎంసెట్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని ఛైర్మన్, కన్వీనర్ తెలిపారు. ప్రాథమిక కీపై ఎటువంటి అభ్యంతరాలున్నా ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు
apeamcet2019objections at gmail.com మెయిల్ ఐఢీకి నిర్దేశించిన ఫార్మాట్‌లో పూర్తిచేసి పంపించాలన్నారు.
ఎంసెట్ ఫలితాలను మే రెండవ వారంలో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ర్యాంకులను నిర్ధారించడానికి ఎంసెట్ మార్కులు 75 శాతం, ఇంటర్ మార్కులు 25 శాతం వెయిటేజీగా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఇంటర్ కాకుండా సీబీఎస్‌ఈ, ఏపీవోఎస్‌ఎస్, టీఎస్‌వోఎస్, ఎస్‌ఐవోఎస్, డిప్లమో, ఆర్‌జీయూకేటీ, ఇతర బోర్డుల నుండి ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు హాల్‌టికెట్‌తో పాటు డిక్లరేషన్ ఫారంను డౌన్‌లోడ్ చేసుకునేలా ఏర్పాట్లుచేశామన్నారు. అలాగే ఇంటర్మీడియన్ విద్యార్థులు దరఖాస్తులో హాల్‌టికెట్ నెంబరు తప్పుగా నమోదుచేస్తే వారికి కూడా హాల్‌టికెట్‌తో పాటు డిక్లరేషన్ ఫారం డౌన్‌లోడ్ అవుతుందన్నారు.
ఇంటర్మీడియట్‌లో వచ్చిన గ్రేడ్ పాయింట్ల వారు వాటితో, మార్కులుగా వచ్చిన వారు డిక్లరేషన్ ఫారంలో మార్కులతో పూర్తిచేసి, తగిన ధ్రువపత్రాలతో ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటలు లోగా ఎంసెట్ కార్యాలయానికి లేదా helplineapeamcet2k19 @ gmail.comమెయిల్ ఐఢీకి పంపించాలన్నారు. ఎంసెట్ కార్యాలయం తగు జాగ్రత్తలు తీసుకుని, గ్రేడ్ పాయింట్లను మార్కులుగా మార్పుచేసి, 25శాతం వెయిటేజీగా చేసుకుని, ర్యాంకులను కేటాయిస్తుందన్నారు.
డిక్లరేషన్ ఫారం, అటెస్టేషన్‌తో కూడిన మార్కుల జాబితాను పంపితేనే మార్కుల వెయిటేజీ తీసుకుని ఎంసెట్ మార్కులతో కలిపి ర్యాంకులను వెల్లడిస్తామని కన్వీనర్ సాయిబాబు వివరించారు.