ఆంధ్రప్రదేశ్‌

అవినీతిపై ఆధారాలుంటే ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 24: రాష్ట్రంలో అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉంటే ఎవరైనా ముందుకొచ్చి ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, ఏంపీలు కూడా ఏసీబీ పరిధిలోకి వస్తారని చెప్పారు. ఏసీబీ డీజీగా వెంకటేశ్వరరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఆయనను కొద్దిరోజుల క్రితం ఎన్నికల సంఘం తప్పించిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల విరామం అనంతరం ఆయనను ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ డీజీగా నియమిస్తూ ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు బుధవారం ఏసీబీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతమున్న శంకర బ్రత బాగ్చీ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఏపీలో అవినీతి నిరోధక శాఖ పటిష్టంగా ఉందని, ఏసీబీలో సిబ్బంది లోటును భర్తీ చేయబోతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అవినీతిని నిరోధించేందుకు ఏసీబీ కృషి చేస్తోందన్నారు. ఇందుకు ప్రజల సహకారం చాలా అవసరమని, ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఏసీబీకి ఫిర్యాదు చేయవచ్చన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఏంపీలు కూడా ఏసీబీ పరిధిలోకి వస్తారని, అవినీతికి సంబంధించిన ఆధారాలుంటే ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏసీబీ ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం పలువురు అధికారులతో వెంకటేశ్వరరావు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.

చిత్రం... బాధ్యతలు స్వీకరించాక ఏసీబీ కార్యాలయం నుంచి వెలుపలికి వస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు