ఆంధ్రప్రదేశ్‌

5 శాతం రిబేటు హుళక్కేనా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, ఏప్రిల్ 25: పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో ఆస్తి పన్నులు ముందస్తుగా చెల్లించేవారికి ప్రభుత్వం కల్పించిన ఐదు శాతం రిబేటు పథకానికి గత మూడు రోజులుగా మొరాయిస్తున్న సర్వర్లు విఘాతం కలిగిస్తున్నాయి. రాష్టవ్య్రాప్తంగా పురపాలక సంఘాలు, నగర పాలకసంస్థల్లో ఏటా వందల కోట్ల రూపాయల్లో ఆస్తిపన్ను బకాయిలు పేరుకుపోతుంటాయి. పన్నుల వసూళ్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం నిర్ణీత కాలపరిమితిలో చెల్లించేవారికి పన్ను మొత్తంలో ఐదు శాతం రిబేటు కల్పిస్తుంది. దీనివల్ల పన్నుల వసూళ్లు సంతృప్తికర రీతిలో ఉంటుండటంతో ఏటేటా ఈ పథకాన్ని అమలుచేస్తోంది. ఏటా మాదిరిగానే ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీలోగా పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రిబేటును ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. అయితే గత మూడు రోజులుగా సర్వర్లు మొరాయించడంతో పన్నుల చెల్లింపు సాధ్యపడటంలేదు. రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని సమాచారం అందుతోంది. పన్నుల చెల్లింపు ఆన్‌లైన్ విధానానికి మార్పుచేసిన అనంతరం రాష్ట్రంలో ఎక్కడి నుండైనా పన్ను చెల్లించే అవకాశం ప్రజలకు కలిగింది. అయితే ఆన్‌లైన్ విధానం అమల్లోకి వచ్చాక మాన్యువల్‌గా పన్నుల వసూలు చేయరాదని ప్రభుత్వం ఆదేశించింది. దీనితో ఆన్‌లైన్ విధానంలో పన్నులు చెల్లించడానికి చేస్తున్న ప్రయత్నాలు సర్వర్ల కారణంగా ఫలించడంలేదు. సర్వరు పనిచేయకపోతే ఆన్‌లైన్‌లో పన్ను అసెస్‌మెంట్, రశీదు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో పన్ను చెల్లించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు మున్సిపల్ కార్యాలయాలకు వచ్చి తిరిగి వెళుతున్నారు. మరో ఐదు రోజుల్లో పన్ను చెల్లింపుకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో పురపాలక శాఖ, ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సర్వర్లు పని చేయించే చర్యలు చేపట్టకపోతే 5 శాతం రాయితీ కేవలం ప్రకటనలకే మిగిలిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. అలాగే రిబేటు కల్పించే గడువును పొడిగించాలని ప్రజలు కోరుతున్నారు.