ఆంధ్రప్రదేశ్‌

రక్తం మరుగుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కిన బిజెపి వైఖరిని చూసి ఐదు కోట్ల ఆంధ్రుల రక్తం మరుగుతోందని వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాను ఆంధ్రాకు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపు విజయవంతమైందన్నారు. బంద్‌ను విఫలం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు బలగాలను ప్రయోగించారని, అయినా సిపిఐ, సిపిఎం తదితర పార్టీల మద్దతుతో, ప్రజలు స్వచ్చందంగా బంద్‌ను జయప్రదం చేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండడం మన ఖర్మ అన్నారు. పలుచోట్ల లాఠీచార్జీలను లెక్కచేయకుండా ప్రజలు రోడ్లపైకి వచ్చారన్నారు. హోదా కోసం సియం చంద్రబాబు పోరాటం చేయాల్సి ఉండగా, ఆ బాధ్యత ప్రతిపక్షం తీసుకుందన్నారు. చంద్రబాబు పోలీసులను ప్రజలపై ఉసిగొల్పడం దురదృష్టకరమన్నారు. పెద్ద ఎత్తున వైకాపా, వామపక్ష పార్టీల కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా పార్లమెంటులో మాట్లాడుతూ చంద్రబాబుతో మాట్లాడానని, ప్యాకేజీ ఇవ్వడంపై కసరత్తు అనే పదం ఉపయోగించారన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఈ రోజు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా సంగతిని చంద్రబాబు మర్చిపోయినా, ఐదు కోట్ల మంది ప్రజలు మర్చిపోరన్నారు. చంద్రబాబు స్వాతంత్య్ర ఉద్యమకాలంలో ఉన్నట్లయితే, పోరాటం ఎందుకుని, స్వాతంత్య్రం ఇప్పుడే ఎందుకని, బ్రిటిష్ వారు స్వాతంత్య్రం వచ్చినప్పుడు తీసుకుందామని కచ్చితంగా మాట్లాడేవారన్నారు. లోక్‌సభలో కూడా టిడిపి సభ్యులు కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడిన వెంటనే తమ సీట్లలో కూర్చున్నారన్నారు. పార్లమెంటు ఆవరణలో జరిగిన టిడిపి నిరసనలో కేంద్రమంత్రులు పాల్గొనకపోవడం దారుణమన్నారు. రాష్ట్రప్రజలను వంచించే ఈ నేతలు మనుషులేనా అని ఆయన అన్నారు. చంద్రబాబు రెండేళ్ల విలువైన సమయాన్ని వృథా చేశారన్నారు. కేంద్రం కూడా రాష్ట్రం పట్ల అన్యాయంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రత్యేక హోదాపై రాజీపడే ప్రసక్తిలేదని, ఈ పోరాటాన్ని రానున్న రోజుల్లో ఉద్ధృతం చేస్తామన్నారు. రాష్ట్రప్రజలు కేంద్రానికి గట్టి గుణపాఠం చెప్పే రోజు వస్తుందన్నారు. గత ఏడాది అమరావతి శంకుస్ధాపన కార్యక్రమంలో కూడా ప్రధాని మోదీ హోదా గురించి ఒక్క మాట మాట్లాడలేదన్నారు. చంద్రబాబు కూడా ఈ వేదికపై హోదా గురించి ప్రస్తావించకుండా మర్చిపోయినట్లు చెప్పారన్నారు. హోదా వల్ల వేల పరిశ్రమలు, లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. త్వరలో ఢిల్లీకి వెళ్లి రాష్టప్రతిని కలుస్తామన్నారు. ప్రత్యేక హోదాపై బిజెపి ప్రభుత్వం చేస్తున్న దగాను వివరిస్తామన్నారు. ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ కోరామని, ఒక వేళ ఖరారైతే, మోదీని కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరిస్తామన్నారు.