ఆంధ్రప్రదేశ్‌

కృష్ణ్ణలో ఉద్ధృతి ఎక్కువగా ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: కృష్ణానదిలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సెక్యూరిటీ మెష్‌లు ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి మంగళవారం నల్లగొండ, మహబూబ్‌నగర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఎస్ సమీక్షించారు. కృష్ణా పుష్కరాలు సమీపించడంతో పనులన్నింటినీ గడువులోగా పూర్తి చేయాలని రాజీవ్ శర్మ ఆదేశించారు. నీరు లేని ఘాట్ల వద్ద భక్తుల స్నానం కోసం నీటి సరఫరా చేయాలని, పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేక లైటింగ్, మొబైల్ టవర్లు, ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, వారం రోజుల తర్వాత పనుల పురోగతిపై తిరిగి సమీక్షించనున్నట్టు రాజీవ్ శర్మ చెప్పారు.

శ్రీశైలంలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, ఆగస్టు 2: శ్రీశైలం జలాశయంలో మంగళవారం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో మంగళవారం తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. ఎడమ విద్యుత్ కేంద్రంలో ఉదయం ఒక జనరేటర్‌ను వాడి కొద్ది సేపటికి నిలిపివేయగా, కుడి కేంద్రంలో నాలుగు జనరేటర్లతో ఉత్పత్తి ప్రారంభించిన కొద్ది సమయానికే వాటిని కూడా నిలిపివేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అవసరమైతే మళ్లీ విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. దీంతో దిగువకు నీటి విడుదల నిలిచిపోయింది. విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో జలాశయం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం జలాశయం నీటిమట్టం 826 అడుగులకు చేరుకోగా 45.68 టిఎంసిల నీరు నిల్వ ఉంది. జూరాల నుంచి 32 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం చేరుకుంటోంది.