ఆంధ్రప్రదేశ్‌

అక్రమార్కులను సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ డీలర్ల అక్రమాలను సహించేది లేదని ఏపి పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత హైదరాబాద్ సచివాలయంలో చెప్పారు. 13 జిల్లాల జెసి, డిఎస్‌ఓ, ఎఎస్‌ఓ, ఎంఆర్‌ఓ, టిడిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా డీలర్ల మార్జిన్ పెంపు, ఫోటోలు లేని కార్టుల అప్‌లోడ్, మీ ఇంటికే మీ రేషన్, బెస్టు ఫింగర్ డిటెక్షన్‌లో ప్రగతి, డమీ రేషన్ షాప్‌ల మూసివేత తదితర అంశాలపై చర్చించారు. ప్రస్తుతం బియ్యంపై క్వింటాల్‌కు 20 రూపాయిలు మార్జిన్ ఇస్తున్నామని దానిని 70 రూపాయిలకు పెంచుతూ క్యాబినెట్ అంగీకారం తెలిపిందని మంత్రి తెలిపారు. ఇంత వరకూ ఏ ప్రభుత్వం చేయనటువంటి రీతిలో డీలర్ల కమిషన్‌ను పెంచామని చెప్పారు.
కార్డుదారులు దుకాణాలకు వచ్చినపుడు వారిని ఇబ్బందులు పెట్టకుండా సరకులు అందజేయాలని , డీలర్లు ఖచ్చితంగా పనివేళలు పాటించాలని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 7 నుండి 11 గంటల వరకూ, సాయంత్రం 4 నుండి 8 గంటల వరకూ, రేషన్ దుకాణాలను తెరచి ఉంచాలని అన్నారు. పట్టణాల్లో ఉదయం 8 నుండి 11 వరకూ సాయంత్రం 4 నుండి 8 వరకూ తెరచి ఉంచాలని పేర్కొన్నారు. అన్ని సరకులను ఒకే మారు అందించాలని, డీలర్లు తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. కార్డులపై ఫోటోలు లేని రేషన్ కార్డులు దాదాపు 14 లక్షల వరకూ ఉన్నాయని, అధికారులు వాటిని సేకరించి వెంటనే అప్‌లోడ్ చేయాలని అన్నారు. మీ ఇంటికి మీ రేషన్ ద్వారా రాష్టవ్య్రాప్తంగా దాదాపు 57 వేల మందికి ఇంటింటికీ సరకులు అందించడం జరుగుతోందని ఆమె వివరించారు. బెస్టు ఫింగర్ డిటెక్షన్ 100 శాతానికి చేర్చాలని ఆమె అధికారులకు సూచించారు. రాష్టవ్య్రాప్తంగా 519 డమీ రేషన్ దుకాణాలు ఉన్నాయని, వీటిని వెంటనే మూసివేయాలని అన్నారు. రంజాన్ సందర్భంగా తోఫా పంపిణీ చేశారని మిగిలిన సరుకులను వెంటనే ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు అందించాలని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్ రవి బాబు, ఎండి రామ్‌గోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.