ఆంధ్రప్రదేశ్‌

కొనసాగుతున్న అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 2: వాయువ్య బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం కూడా కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. దీనికి తోడు ఒడిశా నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో పలు చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తరువాత అల్పపీడనం బలహీనపడుతుందని అధికారులు తెలిపారు.

ఆటోను ఢీకొన్న తారు ట్యాంకర్
ముగ్గురి మృతి
బొల్లాపల్లి, ఆగస్టు 2: ప్రయాణికులున్న ఆటోను తారు ట్యాంకర్ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మేళ్లవాగు సమీపంలో మంగళవారం జరిగింది. కారంపూడి నుండి ప్రయాణికులతో ఆటో రేమిడిచర్లకు బయలుదేరింది. మేళ్లవాగు అడ్డరోడ్టు వద్ద ఆటో మూలమలుపు తిరుగుతుండగా అదే సమయంలో వెనుక నుండి వస్తున్న తారు ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గరికపాడుకు చెందిన వడ్డారపు నాగరాజు(18) అక్కడిక్కడే మృతి చెందాడు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాంపూడిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గరికపాడుకు చెందిన షేక్ సుభాన్‌బీ(32), రేమిడిచర్లకు చెందిన బారెడ్డి బుచ్చమ్మ(65) మృతి చెందారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మచిలీపట్నం, ఆగస్టు 2: కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం రామానగరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. చల్లపల్లికి చెందిన తోకల నాగ కృష్ణకుమారి (39), ఆమె మేనకోడలు చిట్టా నాగ ప్రవల్లిక (8) మంగళవారం సాయంత్రం సరదాగా మోపెడ్‌పై బయటకు వచ్చారు. వీరితోపాటు కృష్ణకుమారి సోదరుడు చిట్టా రవి, అతని కుమారుడు కూడా ద్విచక్ర వాహనంపై వారితో బయటకు వచ్చారు. సాయంత్రం 5గంటల సమయంలో చల్లపల్లి సమీపంలోని రామానగరం వద్ద వెనుక నుండి వస్తున్న లారీ మోపెడ్‌ను ఢీకొంది. దీంతో కృష్ణకుమారి, ప్రవల్లిక అక్కడిక్కడే మృతి చెందారు. వెనుకనే ఉన్న సోదరుడు రవి, అతని కుమారుడు జరిగిన ఘటనకు నిర్ఘాంతపోయారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.