ఆంధ్రప్రదేశ్‌

ప్రాజెక్టు కట్టిందొకరు.. నీళ్లిచ్చే లష్కర్ మరొకరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రాజెక్టు కట్టిందొకరైతే ఆ ప్రాజెక్టులోని నీళ్లిచ్చే లష్కర్ మరొకరని వైకాపా నేత జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనకు ప్రతిస్పందిస్తూ జగన్మోహన్‌రెడ్డి వివిధ ప్రాజెక్టులకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేటాయించిన నిధులు, అంతకుముందు చంద్రబాబు ప్రభు త్వం కేటాయించిన నిధులు, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కేటాయించిన నిధులను జగన్ సభకు వివరించారు. ఈ సందర్భంగా విపక్షనేతకు, ఎపి జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య వాగ్వాదం జరిగింది. పులిచింతల , పోతిరెడ్డిపాడు, పోలవరం కుడికాల్వ, తోటపల్లి, వంశధార, తాడిపూడి, హంద్రీనీవా ప్రాజెక్టులు గురించి సిఎం మాట్లాడుతుంటే తనకు ఆశ్చర్యం కలిగిందని జగన్ పేర్కొనడంతో దేవినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు కట్టినవాడు గొప్పవాడా? లేక ప్రాజెక్టులు నిర్మాణం పూర్తయిన తర్వాత గేట్లు ఎత్తే లష్కర్ గొప్పవాడా అనేది తనకు అర్ధం కాలేదని జగన్ వ్యాఖ్యానించారు. దానికి దేవినేని స్పందిస్తూ, లష్కర్లు అంటే అంత చిన్నచూపుగా ఉందా? అని మండిపడ్డారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడితే అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీదేనని అన్నారు. వైఎస్ హయాంలో అవినీతి జరిగితే దానిని తాము సరిచేశామని, ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఇస్తున్నామని అన్నారు. జల విధానంపై చంద్రబాబు చేసిన ప్రకటనకు జగన్ అభ్యంతరం చెప్పడంతో స్పీకర్ జగన్‌ను అడ్డుకున్నారు. చర్చకు అనుమతించేది లేదు
ప్రభుత్వం ఇచ్చే ప్రకటనపై చర్చ జరపడానికి అనుమతించేది లేదని స్పీకర్ కోడెల స్పష్టం చేశారు. ఒక వేళ ఇదే అంశంపై చర్చ పెట్టదలుచుకుంటే దానికి మరోరూపంలో విపక్షం నోటీసు ఇవ్వాలని సూచించారు. కాల్వశ్రీనివాసులు సైతం జగన్ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేల కోట్ల రూపాయిల ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగం చేశారో వివరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ప్రాజెక్టులపై శాసనసభలో లేదా బయట కూడా చర్చకు సిద్ధమని పేర్కొన్నారు.
కాగా బిజెపి నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని, కేటాయించిన నిధుల గురించి జగన్ చెప్పారే తప్ప, వారు చేసిన అవినీతి గురించి మాత్రం చెప్పలేదని విష్ణుకుమార్ రాజు అన్నారు.
ఈ రాష్ట్రం ఏం చేస్తోంది..
కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఉండి కూడా ఈ రాష్ట్రప్రభుత్వం ప్రాజెక్టులకు సంబంధించి, రైతాంగ సమస్యల పరిష్కారంలో ఏమీ చేయడం లేదని వైకాపా ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి అన్నారు. ఒక్క పైసా కూడా ఇన్‌పుట్ సబ్సిడీగా అందజేయలేదని, ఇన్‌పుట్ సబ్సిడీ అందజేయడానికి ఉన్న నిబంధనలు విడ్డూరంగా ఉన్నాయని పేర్కొన్నారు.