ఆంధ్రప్రదేశ్‌

నేడు మూడోవిడత తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి మూడోవిడత మరో మూడు కీలక శాఖలను గురువారం తరలించనున్నారు. రాష్ట్ర హోం, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తన చాంబర్‌ను మధ్యాహ్నం 12.30 గంటలకు, రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తన పేషీని 11 గంటలకు, పురపాలకశాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తన కార్యాలయాన్ని ఉదయం 11.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ మూడు శాఖల్లో రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఐదో బ్లాక్ ఫస్ట్ఫో్లర్‌లో తన ఛాంబర్‌ను ప్రారంభిస్తారు. మిగిలిన హోం, మున్సిపల్ కార్యాలయాలు, మంత్రుల పేషీలు రెండో బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రారంభం కానున్నాయి. నెలాఖరులోగా మిగిలిన బ్లాకుల గ్రౌండ్ ఫ్లోర్లు పూర్తవుతాయని అధికారులు చెప్తున్నారు. వచ్చే నెలాఖరుకు పూర్తి స్థాయిలో తరలింపుతో పాటు కార్యాలయాల్లో విధుల నిర్వహణకు ఎలాంటి అవరోధాలు ఉండవని భావిస్తున్నారు. సచివాలయానికి మంచినీటి వసతిని తుళ్లూరు నుంచి పైపులైన్ల ద్వారా ఏర్పాటుచేసే ప్రక్రియ పూర్తికాగా, డ్రెయినేజి సమస్య ఇంకా కొలిక్కిరాలేదు. శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయటం ఏజెన్సీలకు కష్టతరంగా మారుతోంది. దీంతో తాత్కాలిక ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటుకానున్న ఫస్ట్ఫో్లర్‌లో అత్యంత భద్రతా ప్రమాణాలతో ఉడెన్ ఫర్నిచర్, ఫ్లోరింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
సకాలంలో రైతులకు ఎరువులు!
రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ని నోడల్ ఏజెన్సీగా నియమించింది. దీనిద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను బఫర్ గోడౌన్లలో నిల్వ చేసింది. నిల్వచేసిన ఎరువులను సహకార సంఘాల ద్వారా నిర్ణీత ధరలకు రైతులకు సకాలంలో సరఫరా చేస్తున్నారు. నిల్వ, రవాణా తదితర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. భూమిలో సూక్ష్మ పోషకాహార లోపాలను అధిగమించి వ్యవసాయ దిగుబడిని పెంపొందించేందుకు జింక్ సల్ఫేట్, బోరాన్, జిప్సమ్‌ను రాయితీపై మార్క్‌ఫెడ్ ద్వారా రైతులకు సరఫరా చేస్తోంది. పంటలను చీడపీడల నుంచి సంరక్షించి తద్వారా అధిక దిగుబడి సాధించేందుకుగాను సస్యరక్షణ మందులను సరఫరా చేస్తోంది. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలను పండించి అధిక దిగుబడి సాధించేందుకు రాయితీపై రైతులకు తుంపర సేద్య పరికరాలు, నీటి సరఫరా పైపులను అందిస్తోంది.
2015 ఖరీఫ్ సీజన్‌లో అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో రూ.50 కోట్ల 23 లక్షల 29 వేల విలువైన 70255.85 క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలు, 2015-16 రబీ సీజన్లో కర్నూలు, కడప జిల్లాల్లో రూ.22 కోట్ల 6 లక్షల 51 వేల విలువైన 34209.50 క్వింటాళ్ల శెనగ విత్తనాలు రాయితీపై పంపిణీ చేశారు. కర్నూలు జిల్లాలో రూ.75 లక్షల 60 వేల విలువైన 1200 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు రాయితీపై అందజేశారు.
కర్నూలు, అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పండిస్తున్న కందికి కోతల సమయంలో సరైన గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నారు. వ్యాపారులకు అయినకాడికి అమ్ముకోవడం తప్ప ప్రత్యామ్నాయ సదుపాయం లేదు. దీనిని నివారించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కోర్కె మేరకు రైతుల నుంచి గిట్టుబాటు ధరతో కందులు కొనుగోలుకు మార్క్‌ఫెడ్ మార్కెట్లోకి ప్రవేశించింది. దీంతో రైతులు దళారుల దోపిడీకి గురి కాకుండా సరైన తూకం ద్వారా తమ కందులకు గిట్టుబాటు ధరకు అమ్ముకుని లబ్థిపొందుతున్నారు. రైతులు అమ్ముకున్న కందులకు పైకం 48 గంటలల్లో ఆన్‌లైన్ విధానం ద్వారా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. ఈ విధానంలో స్వయం సహాయక బృందాల సేవలను వినియోగించుకుటున్నారు. రూ.23 కోట్ల 27 లక్షల విలువైన 2867.950 మెట్రిక్ టన్నుల కందులను కొనుగోలు చేశారు. దీంతో కందుల ధర కోతల సమయంలో రూ.8,200 నిలకడగా ఉంచింది. పలు రకాల పంటలకు గత ఏడాది కంటే క్వింటాలుకు రూ.60 వరకు ప్రభుత్వం మద్దతు ధరను పెంచింది.