ఆంధ్రప్రదేశ్‌

‘ఉపాధి’పై పలు రాష్ట్రాల ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 3: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు అమలు జరుగుతున్న తీరును అధ్యయనం చేసేందుకు 10 రాష్ట్రాల ప్రతినిధులు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఉపాధిలో సాధించిన విజయాలను పరిశీలించడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ఈ నెల 4 నుంచి మూడు రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటిస్తారని రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ రామాంజనేయులు తెలిపారు. బుధవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి అమలులో సాధించిన విజయాలను దేశం గమనిస్తుందని, ఇది రాష్ట్రానికి గర్వకారణమన్నారు. పనుల ఎంపిక, వేతనాలు చెల్లింపు తదితర అంశాల్లో పూర్తిగా పారదర్శకత అమలు చేస్తున్నామన్నారు. ఉపాధి పనుల అమలుకు ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగించడం, వేతనాలను 15 రోజుల్లో చెల్లించడం వంటి చర్యలు ఈ గుర్తింపునకు కారణమన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారన్న అంశం పరిశీలిస్తారన్నారు. ఉపాధి పనులను వివిధ శాఖలతో జోడించడం వల్ల గ్రామాల రూపు రేఖలు మారిపోతున్నాయన్నారు. భారీగా వస్తున్న నిధులతో గ్రామాల్లో సిసి రోడ్లు, అంగన్‌వాడీ భవన నిర్మాణం, డంపింగ్ యార్డులు, చెరువుల పూడికతీత పనులను చేపట్టడం వల్ల గ్రామాలకు మేలు జరుగుతోందన్నారు. వరికోతలు, నాట్లు వంటి అంశాలు మినహా మిగిలిన వ్యవసాయ పనులకు 60 శాతం మేర నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. గత ఏడాది 2400 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పనుల కింద ఖర్చు చేయగా, 1800 కోట్ల రూపాయల మేరకు ఆస్తులు సమాకూరాయన్నారు.
అవసరమైన సమయాల్లో రాష్ట్ర ప్రభుత్వం గ్యాప్ ఫండ్‌గా 1000 కోట్ల రూపాయలు సమకూరుస్తున్నదని వివరించారు. ఉపాధి హామీ కింద గ్రామాల్లో దేశంలో 18 వేల కిలోమీటర్ల మేర సిసి రోడ్లు నిర్మించగా, రాష్ట్రంలో 3600 కిలోమీటర్ల మేర సిసి రోడ్డు నిర్మించామని, 7000 అంగన్‌వాడీ భవనాలు నిర్మించామన్నారు. ఈ ఏడాది 5000 కిలోమీటర్ల మేర సిసి రోడ్లు నిర్మించాలని, 150 మండల కార్యాలయ భవనాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మెటీరియల్ కాంపొనెంట్ కింద నిధులు మిగిలిన జిల్లాలకు 10 శాతం మాత్రమే నిధులు కేటాయించామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అమలుకు కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. జనాభా తక్కువగా ఉండటం, ఆవాసాల మధ్య దూరం ఎక్కువ ఉండటంతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిని దృష్టిలో నీడ్ బేస్డ్‌గా పనులు చేపట్టనున్నామన్నారు. సోషల్ ఆడిట్‌లో కొన్ని మార్పులు అవసరమన్నారు. ఒకరి బదులు మరొకరు, ఒక పని బదులు మరో పని చేపట్టడం అభ్యంతరకరం కాదన్నారు.