అంతర్జాతీయం

జపాన్ సముద్ర జలాల్లోకి దూసుకెళ్లిన ఉ.కొరియా క్షిపణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, ఆగస్టు 3: ఉత్తర కొరియా బుధవారం తొలిసారి నేరుగా జపాన్ సముద్ర జలాల్లోకి ఒక ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. దీనిపై జపాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు.. ఉత్తర కొరియాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలకు ఇది కారణమైంది. వాస్తవానికి ఉత్తర కొరియా రెండు రోడోంగ్ మధ్యశ్రేణి క్షిపణులను ఏకకాలంలో ప్రయోగించిందని, అయితే అందులో ఒకటి ప్రయోగించిన వెంటనే పేలిపోగా, మరోటి నేరుగా జపాన్ సముద్ర జలాల్లో పడిందని అమెరికా సైన్యం ప్రకటించింది. దక్షిణ కొరియాలో అమెరికా క్షిపణి విధ్వంసక వ్యవస్థను మోహరించడంపై ఉత్తర కొరియా ప్రత్యక్ష చర్యకు దిగుతామని హెచ్చరించడం, అలాగే మరికొద్ది వారాల్లోనే అమెరికా, దక్షిణ కొరియా దేశాలు సంయుక్తంగా పెద్దఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ క్షిపణి ప్రయోగం జరగడం గమనార్హం.
ఒక క్షిపణి తమ సముద్ర జలాల్లో పడిందని, ఉత్తర తీరంలోని ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ (ఇఇజడ్)కు 250 కిలోమీటర్ల దూరంలో ఇది పడిందని జపాన్ వెల్లడించింది. ఇది తమ దేశ భద్రతకు తీవ్ర ప్రమాదం కలిగించే అంశమని జపాన్ ప్రధాని షింజో అబే అంటూ, ఇలాంటి చర్యలను ఎంతమాత్రం సహించబోమని హెచ్చరించారు. అమెరికా సైతం ఉత్తర కొరియా చర్యను ఖండిస్తూ, బాలిస్టిక్ క్షిపణి టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఉత్తర కొరియా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలను పూర్తిగా అతిక్రమిస్తోందని పేర్కొంది.