ఆంధ్రప్రదేశ్‌

ఉపాధ్యాయుల బదిలీలు మరింత గందరగోళం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం కారణంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ మరింత గందరగోళంగా తయారు కానుంది. ఇప్పటి వరకూ స్పౌజ్ (్భర్త/్భర్య) కేసు బదిలీలను ప్రభుత్వ ఉపాధ్యాయుల మధ్య మాత్రమే పరిమితం చేయగా, ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తూ, వారి స్పౌజ్‌లు ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధాయులుగా పని చేస్తున్నా బదిలీకి చేసేందుకు వీలుగా విద్యా శాఖ ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేసేందుకు వీలుగా విద్యా శాఖ ఒక కమిటీని నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఏపీ అన్‌ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు సమావేశమయ్యారు.
ఆ సమావేశంలో జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల స్పౌజ్‌లు ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా, కరెస్పాండెంట్లుగా పని చేస్తున్న సందర్భాల్లో బదిలీ ప్రక్రియలో స్పెషల్ పాయింట్లు ఇవ్వాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ప్రతినిధులు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు వీలుగా కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమిటీ నివేదిక ఆధారంగా ఈ తరహా స్పౌజ్ కేసులకు ప్రత్యేక పాయింట్లు ఇచ్చే అంశం ఖరారు చేయనున్నారు. ఆరు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సహా 12 మందితో ఒక కమిటీని విద్యా శాఖ ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికే ఉపాధ్యాయ బదిలీల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను పరిగణలోకి తీసుకుని పాయింట్లు ఇవ్వడం మరింత గందరగోళానికి దారితీయనుంది. ప్రతి ఏటా బదిలీ ప్రక్రియ ప్రహసనంగా మారుతున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది.