ఆంధ్రప్రదేశ్‌

జ్ఞానభూమి పోర్టల్‌లో విద్యార్థుల సమాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), మే 15: విద్యార్థులకు సంబంధించి అకడమిక్ నుండి స్కాలర్‌షిప్పుల వరకు అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో జ్ఞానభూమి పోర్టల్ 2.0 వెర్షన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ తెలిపారు. బుధవారం విజయవాడలో జ్ఞానభూమి పోర్టల్‌పై జరిగిన వర్క్‌షాప్‌లో ముఖ్యఅతిధిగా పాల్గొన్న రావత్ మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన డేటా అంతా ఆన్‌లైన్‌లో జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఉన్న 1.0 వెర్షన్‌ను ఆప్‌డేట్ చేసి 2.0 వెర్షన్‌గా అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. దీని వల్ల విద్యార్థులకు సంబంధించిన హాజరు శాతం, స్కాలర్‌షిప్స్ వివరాలు, పరీక్షల వివరాలు, అకాడమిక్ వివరాలు, పరీక్ష ఫలితాలు అన్ని జ్ఞాన భూమి పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సంబంధించి మంజూరైన స్కాలర్‌షిప్‌లు, రావాల్సిన స్కాలర్‌షిప్‌ల వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయన్నారు. ఎవరినీ అడగాల్సిన అవసరం లేకుండా విద్యార్థులకు వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆయా విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలలు ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
దీనికి సంబంధించి రాయలసీమ విశ్వవిద్యాలయంలో పైలెట్ ప్రాజెక్ట్ చేశామని, కళాశాలలకు విశ్వవిద్యాలయాల అఫ్లియేషన్‌ను తప్పనిసరి చేస్తున్నామని పేర్కొన్నారు. జ్ఞానభూమి పోర్టల్‌పై వర్క్‌షాప్‌ను రాయలసీమ జిల్లాలకు సంబంధించి తిరుపతిలో, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి విశాఖపట్నంలో ఒకరోజు నిర్వహిస్తామన్నారు.
బుధవారం జరిగిన వర్క్‌షాప్‌లో ప్రకాశం, పశ్చిమగోదావరి, నెల్లూరు, గుంటూరు, కృష్ణాజిల్లాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖల అధికారులు, ఉన్నత విద్యాశాఖకు చెందిన అధికారులు, పాలిటెక్నిక్ కళాశాలల అధికారులు, మెడికల్ అండ్ హెల్త్ అధికారులు హాజరయ్యారు. అనంతరం జ్ఞానభూమి పోర్టల్‌పై ఉన్న సందేహాలకు రావత్ సమాధానాలు ఇచ్చారు. ఈవర్క్‌షాప్‌లో సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు పీ భాస్కర్, డెప్యూటీ డైరెక్టర్ తనూజా రాణి, జిల్లాల ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖలకు చెందిన డీడీలు, తదితరులు పాల్గొన్నారు.