ఆంధ్రప్రదేశ్‌

మమతా బెనర్జీని అరెస్ట్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: హింసను ప్రేరేపిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నేత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీపై కోల్‌కతాలో జరిగిన దాడికి నిరసనగా విజయవాడలో బీజేపీ బుధవారం నిర్వహించిన ప్రదర్శన, ధర్నాలో పాల్గొన్న కన్నా అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ అమిత్ షాపై తృణమూల్ కార్యకర్తల రాళ్ల దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజామద్దతు కోల్పోయిన మమతా బెనర్జీ.. బెంగాల్‌లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి తీవ్రమైన అసహనానికి గురయ్యారన్నారు. హింస ద్వారా గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడికి ఒక సిద్ధాంతం లేదని విమర్శించారు.
పోలింగ్‌కు ముందే వ్యూహాత్మకంగా లక్షలాది ఓట్లను తొలగించారన్నారు. అలాగే కర్నాటక వెళ్లి కాంగ్రెస్ కూటమికి, ఢీల్లీకి వెళ్లి కేజ్రీవాల్‌కు మద్దతు ఇచ్చారన్నారు. అక్కడ అప్, కాంగ్రెస్, బీజేపీ పోటీ చేస్తున్నాయన్నారు. అలాగే బెంగాల్ వెళ్లి మమతకు మద్దతిచ్చారని అక్కడ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయన్నారు. ఒక సిద్ధాంతం లేకుండా అవినీతే సిద్ధాంతంగా ఉన్న అరాచక శక్తులన్నీ ఒకటై మోదీని ఓడించేందుకు ప్రయత్నించాయని, అయితే గడచిన ఆరు విడతల ఎన్నికల్లో మోదీ ప్రభంజనం వీచిందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 300కు పైగా సీట్లు వస్తాయన్నారు.

చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ