ఆంధ్రప్రదేశ్‌

రీపోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 17: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఈనెల 19న నిర్వహించనున్న ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చంద్రగిరి ఆర్‌ఓ, తిరుపతి సబ్‌కలెక్టర్ డాక్టర్ మహేష్‌కుమార్ వెల్లడించారు. శుక్రవారం ఉదయం బరిలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లకు రీపోలింగ్ ఏర్పాట్లు వివరించి, వారి సమక్షంలో మాక్ పోలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఓ మాట్లాడుతూ రీపోలింగ్ జరుగుతున్న పాకాల మండలం 104పులివర్తివారిపల్లి, ఆర్‌సీ పురం మండలం 313వెంకట్రామాపురం, 316కొత్తకండ్రిగ, 318కమ్మపల్లి, 321 ఎన్‌ఆర్ కమ్మపల్లి అని, ఇప్పటికే 90శాతం ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగిలినవి శుక్రవారం రాత్రిలోపు పూర్తి చేస్తామన్నారు. రీపోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో 15మంది సెక్టోరల్ అధికారులు, ఒక్కొక్క కేంద్రానికి 250మంది పోలీసు, ఆర్‌పీఎఫ్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పార్టీలు, ప్రజలు సహకరించాలని సూచించారు. శనివారం సాయంత్రం 4గంటల లోపు పోలింగ్ సిబ్బంది, ఈవిఎంలు చేరుకుంటాయని తెలిపారు. ఆర్‌ఓ సమక్షంలో అభ్యర్థులు స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న 30 ఈవిఎంలలో మాక్‌పోల్ ప్రక్రియను నిర్వహించి పరిశీలించారు. 19న ఉదయం 7గంటలనుంచి సాయంత్రం 6గంటలవరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు.
చిత్రం...తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల
పనితీరును పరిశీలిస్తున్న ఆర్‌ఓ డాక్టర్ మహేష్‌కుమార్