ఆంధ్రప్రదేశ్‌

సొంత గూటికి దేవినేని నెహ్రూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 4: పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. పార్టీలో చీలిక అనంతరం ఎన్టీఆర్ తెలుగుదేశంలో కొంతకాలం కీలక పాత్ర వహించి ఆపై గడచిన 17ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలలో ముఖ్య పాత్ర వహిస్తూ వచ్చిన నెహ్రూ తెలుగుదేశంలో చేరాలనే నిర్ణయంపై కృష్ణా జిల్లాలో ప్రకంపనలు రేగుతున్నాయి. తెలుగుదేశంలోనున్న నెహ్రూ ప్రత్యర్థులలో ఆంతరంగిక సమావేశాలు, సమాలోచనలు ఎడతెగని విధంగా జరుగుతున్నాయి. నగరంలో బసచేసిన టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావును నెహ్రూ కల్సి ఏకాంతంగా సంభాషించడం ఒక్కసారిగా ఊహాగానాలకు తెరలేపాయి. ఆయన తనయుడు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాత్రం తన తండ్రి కళా వెంకట్రావును కలవలేదని, తెలుగుదేశంలో చేరుతున్నారనే ప్రచారంలో కూడా వాస్తవం లేదని ఖండించారు. ఈ విషయమై పలువురు తెలుగుదేశం శాసనసభ్యులను ప్రశ్నించగా నెహ్రూ తెలుగుదేశంలో చేరుతున్నారంటూ తేల్చి చెప్పారు. నెహ్రూను తెలుగుదేశంలోకి తీసుకురావటానికి ఆయన సమీప బంధువు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంధానకర్తగా వ్యవహరించారనే ప్రచారం జరుగుతోంది. ఇక నెహ్రూ వ్యతిరేకులు ఈ పరిణామం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పటికీ ఏ ఒక్కరు కూడా బైటపడటటం లేదు. గత ఎన్నికల్లో పెడన నుంచి వైకాపా తరఫున పోటీ చేసిన మాజీ డెప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ ఇటీవలి కాలంలో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. వీరిరువురు కలసి త్వరలో సిఎం చంద్రబాబుతో భేటీ అయి పుష్కరాలు అనంతరం జిల్లాలోని తమ అనుయాయులతో కల్సి తెలుగుదేశంలో చేరతారని తెలుస్తోంది. 1983 తెలుగుదేశం ఆవిర్భావ సమావేశంలోనే ఆ పార్టీలో ప్రవేశించి రాజకీయ ఆరంగ్రేటం చేసిన నెహ్రూ కంకిపాడు నుంచి ఆ పార్టీ తరఫున 1983, 85, 89, 94 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు. తెలుగుదేశంలో చీలిక ఏర్పడినపుడు ఎన్టీఆర్ పక్షాన నిలువటమేగాక లక్ష్మీ పార్వతి నాయకత్వంలో పనిచేస్తూ 1998 పార్లమెంటు ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఐదోసారి గెలిచారు. నియోజకవర్గ పునర్విభజనతో 2009 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో తిరిగి పోటీచేసి మరోమారు ఓటమి పాలయ్యారు.