ఆంధ్రప్రదేశ్‌

ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), మే 20: ఏపీ లాసెట్ ఫలితాలను సోమవారం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు, సెట్ చైర్మన్ ప్రొఫెసర్ రహామ్మతుల్లాలు విడుదల చేశారు. ఫలితాల్లో ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బి కోర్సులో 95.42 శాతం, మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బి కోర్సులో 93.745 శాతం, రెండు సంవత్సరాల ఎల్‌ఎల్‌ఎం కోర్సులో 95.313 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బి కోర్సుకు 2851 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2511 మంది హాజరయ్యారు. వీరిలో 2396 మంది అర్హత సాధించారు.
మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బి కోర్సులో 9751 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 8282 మంది హాజరయ్యారు. 7764 మంది అర్హత సాధించారు. అలాగే రెండు సంవత్సరాలు ఎల్‌ఎల్‌ఎం కోర్సులో 787 మంది దరఖాస్తు చేసుకోగా 704 మంది హాజరయ్యారు. వీరిలో 671 మంది అర్హత సాధించారు.
రాష్ట్రంలో ఎల్‌ఎల్‌బి ఐదు సంవత్సరాల కోర్సుకు ప్రభుత్వ, యూనివర్సిటీ కళాశాలలు మూడు, ప్రైవేట్ కళాశాలలు 24 అందుబాటులో ఉన్నాయని, ఎల్‌ఎల్‌బి మూడు సంవత్సరాల కోర్సుకు ప్రభుత్వ, యూనివర్సిటీ కళాశాలలు నాలుగు, ప్రైవేట్ కళాశాలలు 27, ఎల్‌ఎల్‌ఎం రెండు సంవత్సరాల కోర్సుకు ప్రభుత్వ, యూనివర్సిటీ కళాశాలలు ఆరు, ప్రైవేట్ కళాశాలలు ఆరు అందుబాటులో ఉన్నాయన్నారు. ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బి విభాగంలో ఎం సూరజ్ (శ్రీకాకుళం) ప్రథమర్యాంక్, టి కిరణ్‌కుమార్ రెడ్డి (కర్నూలు) రెండవర్యాంక్, హరి యశశ్విని (హైదరాబాద్) మూడవర్యాంక్, ఎం తేజశ్రీ (విజయవాడ) నాల్గోర్యాంక్, ఎస్‌విఎస్‌ఎస్‌జి అఖిల్ (విశాఖపట్నం) ఐదోర్యాంక్ సాధించారు. మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బి విభాగంలో కెవి శివరెడ్డి (కడప) ప్రథమర్యాంక్, ఆర్ జగదీష్ (చిత్తూరు) రెండో ర్యాంక్, కె చంద్రశేఖర్ (కర్నూలు) మూడోర్యాంక్, బి తిరుపతి (విజయనగరం) నాల్గోర్యాంక్, శ్రీనివాసులుచంద్ర (నెల్లూరు) ఐదోర్యాంక్ దక్కించుకున్నారు.
రెండు సంవత్సరాల ఎల్‌ఎల్‌ఎం విభాగంలో వి లీలాకృష్ణ (విజయవాడ) మొదటిర్యాంక్, బి రవికిరణ్ సింగ్ (విశాఖపట్నం) రెండోర్యాంక్, జి మహీత్ విద్యాసాగర్ (గుంటూరు) మూడోర్యాంక్, ఎన్‌విఎన్‌ఎస్‌ఎస్ ఉషా అమూల్య (విశాఖపట్నం) నాల్గోర్యాంక్, జి నిష్కాపాత్రుడు (విశాఖపట్నం) ఐదోర్యాంక్ సాధించారు. ఈనెల 22వతేదీ నుండి ర్యాంక్ కార్డులను వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని విజయరాజు పేర్కొన్నారు.