ఆంధ్రప్రదేశ్‌

ఈసీ దుర్వినియోగం ఇంతా అంతా కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 20: ఈ సారి ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ చేసిన దుర్వినియోగం ఇంతా అంతా కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండవల్లి ప్రజావేదిక నుంచి పార్టీ నేతలతో సోమవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్సులో చంద్రబాబు మాట్లాడుతూ సులభంగా, ప్రశాంతంగా నిర్వహించాల్సిన ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వివాదాస్పదం చేసిందని మండిపడ్డారు. 110 అసెంబ్లీ స్థానాల్లో విజయం మనదేనని, 18 నుంచి 20 ఎంపీ స్థానాలు సైతం తమవేనని తెలిపారు. ఏపీలో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. 130 అసెంబ్లీ స్థానాల వరకూ కూడా గెలుపు వెళ్లవచ్చన్నారు. నూటికి నూరు శాతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామన్న ధీమా వ్యక్తం చేశారు. కొందరు మైండ్ గేమ్‌తో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తొలుత వీవీప్యాట్ స్పిప్‌లను లెక్కించాలనే డిమాండ్‌తో మంగళవారం ఢిల్లీలో అన్ని పార్టీలతో కలిసి ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. 22న కౌంటింగ్ ప్రక్రియపై మరోమారు అందరికీ శిక్షణ ఇస్తామన్నారు. అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపులోనూ జాగ్రత్తగా ఉండాలన్నారు. మోదీ అందరినీ బ్లాక్ మొయిల్ చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు.