ఆంధ్రప్రదేశ్‌

ఎగ్జిట్ పోల్స్ మోదీ కుటిల వ్యూహంలో భాగమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 20: జాతీయ మీడియా సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ బూటకపు సర్వేలని, వాటిని విడుదల చేసిన సంస్థలు, వ్యక్తులు తమకున్న విశ్వసనీయత కోల్పోయేలా ఆ సమాచారం ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శాసన మండలిలో ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఉండవల్లిలోని మీడియా పాయింట్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ ఏప్రిల్ 11 నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ మోదీ మైండ్‌గేమ్‌లో భాగంగానే జరిగాయన్న బుద్దా, తాజాగా వెలువడిన సర్వేల ఫలితాలు కూడా ప్రధాని కుటిల వ్యూహంలో భాగమేనని తేల్చి చెప్పారు.
ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటే ఆయా సంస్థలు మంచివని, లేకుంటే తప్పుడు సమాచారం ఇచ్చాయని చెప్పడం తమ ఉద్దేశం కాదన్న బుద్దా, గతంలో ఆయా సంస్థలు వెలువరించిన ఎగ్జిట్‌పోల్స్, వచ్చిన ఫలితాలకు పొంతనలేని విషయాన్ని అందరూ గమనించాలని సూచించారు. 2004, 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో సీ - ఓటర్, టుడేస్ చాణక్య ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రజలు ఇచ్చిన తీర్పుకి దగ్గరగా ఉంటే మిగిలిన సంస్థలన్నీ వాటికి తోచిన విధంగా చెప్పాయన్నారు. జాతీయ స్థాయిలో మోదీకి వత్తాసు పలికిన మీడియా సంస్థలన్నీ, రాష్ట్రంలో జగన్ పార్టీ గెలుస్తుందని చెప్పడంలోని ఆంతర్యమేమిటో ప్రజలే గ్రహించాలన్నారు. లగడపాటి సర్వే కూడా తప్పేనని వెంకన్న అన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 130 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.