ఆంధ్రప్రదేశ్‌

చీనీ తోటలను కాపాడాలి : సీఎస్‌కు సీపీఎం వినతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 20: అనంతపురం జిల్లా గార్లదినె్న మండలంలోని ముకుందాపురం గ్రామంలో ఎండిపోతున్న చీనీ తోటలను కాపాడాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు బహిరంగ లేఖ రాసారు. ముకుందాపురం గ్రామంలో 1650 హెక్టార్లలో చీనీ తోటలు సాగవుతున్నాయని, గత అనేక సంవత్సరాలుగా చీనీ పంట సాగులో, దిగుబడిలో ఈ గ్రామం ప్రసిద్ధి చెందిందన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు చెట్టుకు రోజుకు రూ. 2 నుండి రూ. 4 దాకా ఖర్చు అవుతోందన్నారు. ఇంత పెద్ద ఎత్తున భారం మోయలేని 27 మంది పేద, మధ్య తరగతి రైతుల తోటల్లోని సుమారు 13,600 చెట్లు పూర్తిగా ఎండిపోయాయన్నారు. సమస్య తీవ్రత రీత్యా రైతులు నేటి నుండి దీక్షలు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వం తక్షణమే వీరి సమస్యలు పరిష్కరించి దీక్షలు విరమింపజేయాలని మధు కోరారు.