ఆంధ్రప్రదేశ్‌

ఖరీఫ్ కంటింజెన్సీ ప్రణాళికపై సన్నద్ధత అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 20: రాష్ట్రంలో ఖరీఫ్ కంటింజెన్సీ ప్రణాళికపై సన్నద్ధత అవసరమని వ్యవసాయ శాఖ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఖరీఫ్ కంటింజెన్సీ (ప్రత్యామ్నాయ) ప్రణాళికపై సోమవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జూలై 15 నాటికి సాధారణ వర్షపాతం నమోదు కాకపోతే, ఈ కంటింజెన్సీ ప్రణాళిక అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ముందుగానే వివిధ రకాల విత్తనాలను రైతులను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటికే సేకరించిన విత్తనాలు సకాలంలో రైతులకు అందేలా చూడాలన్నారు. ఈ విత్తనాలను జిల్లాల వారీగా మండల స్థాయి విత్తన ఔట్‌లెట్లలో అందుబాటులో ఉంచాలన్నారు. నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసేందుకు తీసుకోవాలని, నాణ్యతలో రాజీపడవద్దని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకం కింద ఎక్కువగా వ్యవసాయ పనులు చేపట్టేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ కంటిజెన్సీ ప్రణాళిక అమలుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. వర్షాలు సకాలంలో కురియపోతే 1.04 లక్షల ఎకరాల్లో ఈ ప్రణాళికలను అమలు చేసేందుకు 22 వేల క్వింటాళ్ల వరి, మినుము, పెసర, కంది, మొక్కజొన్న, రాగి, కొర్రలు వంటి రకాల విత్తనాలు సిద్ధం చేశామన్నారు.
జూలై 31 నాటికి కూడా వర్షాలు కురియకపోతే, 4.74 లక్షల హెక్టార్లలో కంటిజెన్సీ ప్రణాళిక అమలు చేస్తామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అవసరమై విత్తన నిల్వలను అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే, ఆరుతడి పంటలు, స్వల్పకాలిక పంటలు పండించాలని రైతులను చైతన్యవంతులను చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎస్‌కు వివరించారు. పత్తికి బదులుగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల వంటివి సాగు చేయాలని సూచిస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి సేద్యం పట్ల రైతులను ఆకర్షితులను చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులను అధికమించేందుకు ఇప్పటికే 5 రకాల కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు.