రాష్ట్రీయం

సహనం కోల్పోతున్న బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ, మే 21: ఎన్నికల సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ తమకు వ్యతిరేకంగా రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత రామచంద్రయ్య అన్నారు. రాజకీయాల్లో సీనియర్‌నని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసినా సర్వేలను చూసి హుందాతనం కోల్పోతున్నారని అన్నారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల అనంతరం వస్తున్న వివిధ సర్వేల ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూశాక తెలుగుదేశం పార్టీ ఓటమి తప్పదని నిర్ణయించుకున్న చంద్రబాబు తీర్పు తనకు అనుకూలంగా లేదని భావించి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. అంతేగాక ఎన్నికల కౌంటింగ్, ఫలితాల వెల్లడిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించే మనస్థత్వం ఆయనకు లేదన్నారు. దేశంలోని ప్రతిపక్షాలు బాబుతో కలిసిరావడం లేదన్నారు. చంద్రబాబునాయుడు ఇంతవరకు ఏనాడూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నాలు చేయలేదన్నారు. ప్రజాస్వామ్యవాదే అయితే ఇతర పార్టీల నాయకులను తన పార్టీలోకి తీసుకునే వాడా అంటూ ప్రశ్నించారు. పంచాయితీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, గవర్నర్ వ్యవస్థను కూడా సర్వనాశనం చేశారని ఆరోపించారు. తొలిసారిగా రాష్ట్రంలోని విచారణ నిమిత్తం సీబీఐని రాకుండా కట్టడి చేశారన్నారు. ఎస్పీలు, చీఫ్ సెక్రటరీలను ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం బదిలీ చేస్తే, తిరిగి జీవోలు తెచ్చి వారిని నియమించారన్నారు. సుప్రీంకోర్టు మాటలకు వక్రభాష్యాలు చెప్పడం ఆయనకే చెల్లిందన్నారు. ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ముందు వ్యతిరేక ప్రదర్శన చేస్తానంటున్నాడని, అలా చేసి ఏం సాధిస్తారో చూడాలన్నారు. 50 శాతం వీవీ ప్యాట్స్ లెక్కింపును సుప్రీం కోర్టు సమర్థించలేదని, కేవలం 5 శాతం వీవీప్యాట్స్‌ను లెక్కించి సరిచూసుకోమని చెప్పినా సుప్రీం మాటలను వక్రీకరిస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే ఎన్నికల కమిషన్‌పై కానీ, ఓటింగ్ మిషన్లపై కానీ నిందలు వేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పే పరిస్థితులు లేవన్నారు. దేశంలోని ప్రతిపక్షాలేవీ చంద్రబాబును నమ్మడం లేదని, అక్కడ నెంబర్‌కే కానీ, వ్యక్తికి ప్రాధాన్యత ఉండదన్నారు. వివిధ రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతల చుట్టూ తిరుగుతూ తానేదో జాతీయ స్థాయి నాయకునిగా ఎదగాలని ప్రయత్నిస్తున్నాడని , ఆయన్ను ఇతర పార్టీలు నమ్మడం లేదని ఈ తిరుగుళ్లతో ఏపీ గౌరవాన్ని మంటగలుపుతున్నారన్నారు. తన అవలక్షణాలు సైతం ఇతర పార్టీలకు నేర్పేప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్‌రెడ్డి ప్రకాశం ముందు తట్టుకోలేక చంద్రబాబునాయుడు మసకబారి పోతున్నారన్నారు. ఆయన భావజాలానికి అంత్యకాలం సమీపించిందని కేవలం కొన్నిగంటల్లో వెలువడే ఫలితాలే ఆ పార్టీ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.