ఆంధ్రప్రదేశ్‌

కౌంటింగ్‌కు మూడంచెల భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 21: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్రంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాటు చేసినట్లు డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా బందోబస్తు విధుల్లో 25వేల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారన్నారు. ప్రశాంతంగా లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు కట్టుదిట్టమైన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.
రాష్టవ్య్రాప్తంగా 36 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయని, అన్ని చోట్ల గట్టి బందోబస్తు పెడుతున్నామన్నారు. ఓట్ల లెక్కింపు ఈనెల 23వ తేదీన రాష్ట్రంలో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి బందోబస్తు ఏర్పాట్లను డీజీపీ వివరించారు. పారామలిటరీ, ఏపీఎస్పీ, జిల్లా పోలీసు, పెట్రోలింగ్ బృందాలతో మూడు అంచెలుగా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. 20 కంపెనీల సీఆర్‌పీఎఫ్, 15 కంపెనీల సీఈఏపీఎఫ్, 61 ఏపీఎస్‌పీ కంపెనీలు కౌంటింగ్ బందోబస్తు విధుల్లో ఉంటాయన్నారు. అనుమానితులు, రౌడీషీటర్లను ఇప్పటికే రాష్టవ్య్రాప్తంగా బైండోవర్ చేశామని, అల్లర్లు సృష్టిస్తారనే సమాచారంతో ముందుగానే అలాంటి వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా గుర్తించిన ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన కౌంటింగ్ సెంటర్ల వద్ద ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేయడంతోపాటు నిరంతరం ప్రత్యేక బలగాలు పెట్రోలింగ్ ఉంటుందని చెప్పారు. ఇక కౌంటింగ్ సందర్భంగా సాంకేతిక పరిఙ్ఞనాన్ని విరివిగా వినియోగిస్తున్నామన్నారు. కౌంటింగ్‌కు 1200 బాడీ ఓర్ ( సిబ్బంది శరీరంపై ధరించే) కెమెరాలు వినియోగిస్తున్నామని, ఐదు ఫాల్కన్ వెహికల్స్ పెడుతున్నామన్నారు.
14,770 సీసీ కెమెరాలు రాష్టవ్య్రాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద వినియోగంలో ఉంటాయన్నారు. అదేవిధంగా 68 డ్రోన్ కెమేరాలతో ఎప్పటికప్పుడు రాష్టవ్య్రాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిస్ధితిని పర్యవేక్షిస్తామని డీజీపీ వెల్లడించారు. సిఏపిఎఫ్‌కు సంబంధించి 35 కంపెనీలు (20+15)చెందిన 3325 మంది సిబ్బందితోపాటు, ఏపిఎస్‌పికి సంబంధించి 61 కంపెనీలకు చెందిన 5490 మంది సిబ్బంది, జిల్లా పోలీసు బలగాలకు సంబంధించి 21మంది ఎస్పీలు, 31మంది అదనపు ఎస్పీలు, 137 మంది డిఎస్పీలు, 379 మంది సిఐలు, 1037 మంది ఎస్‌ఐలు, 2425 మంది ఎఎస్‌ఐ/హెడ్ కానిస్టేబుళ్ళు, 6510 మంది కానిస్టేబుళ్ళు, 2759 మంది హోంగార్డులు, 118 మంది ప్రత్యేక బలగాలు, 67 ప్లటూన్‌ల ఆర్మ్‌డ్ రిజర్వు బలగాలు మొత్తం 25,224 వేల మంది అధికారులు, సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారని డీజీపీ చెప్పారు.