రాష్ట్రీయం

ఏనుగుల దాడి.. వృద్ధుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జియ్యమ్మవలస, మే 21: విజయనగరం జిల్లా మండలంలోని పెదకుదమ గ్రామ సమీపంలో ఏనుగుల దాడికి ఓ వృద్ధుడు మంగళవారం మృతి చెందాడు. పెదకుదమ గ్రామంలో ఉన్న అరటితోటలో పని చేయడానికి వెళ్లిన కైదు కానన్నదొర(75)పై అకస్మాత్తుగా ఏనుగులు ఒకేసారి దాడి చేశాయి. తీవ్ర అస్వస్థతకు గురైన కానన్నదొరను పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కానన్నదొర ఏనుగుల దాడిలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేటివాడ, పెదకుదమ గ్రామాల మధ్య ఉన్న అరటితోటలో ఏనుగులు సంచరిస్తున్నాయి. ఒకపక్క పంటలను ఏనుగులు ధ్వంసం చేస్తుండటమే కాకుండా ప్రాణాలను కూడా తీస్తుండటంతో ఈప్రాంత ప్రజలు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ మండలంలోనే ఇప్పటివరకు ఐదుగురి ప్రాణాలను బలిగొన్న ఏనుగులు తాజాగా కానన్నదొరను పొట్టన పెట్టుకున్నాయ. ఎంతమంది ప్రాణాలు పోతున్నా, పంటలను ధ్వంసం చేస్తున్నా, కోట్లాది రూపాయలను రైతులు నష్టపోతున్నా అటవీ అధికారులు కనీసం పట్టించుకోకపోవడం తీవ్ర అన్యాయమని ప్రజలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగులను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నించాలని కోరుతున్నారు.

చిత్రం...ఏనుగుల దాడితో అరటితోటలో మరణించిన కామన్నదొర